ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తి చేసాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కథ ప్రకారం ఈ సినిమాలో చిరు రెండు పాత్రలు పోషించనున్నాడు. అందులో ఒకటి నక్సలైట్ పాత్ర అని ఫిల్మ్ నగర్ చెబుతున్నాయి. ఈ పాత్ర కోసం చిరంజీవి దాదాపు 10 కిలోలకు పైగా బరువు తగ్గడు. అందుకోసం కేరళ వెళ్లి ప్రత్యేక చికిత్స తీసుకున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా చిరంజీవి నవ యువకుడిలా మారిన ఫోటోలను చిరు కోడలు ఉపాసన ఆమె సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను ఉపాసన అపోలో హాస్పిటల్స్ తరుపున నడుపుతున్న హెల్త్ మ్యాగజైన్ ‘బీ పాజిటివ్’ కవర్ పేజీపై ప్రచురితమైంది. సరిగ్గా పాతికేళ్ల క్రితం చిరంజీవి ఎలా ఉండేవారే.. అలా సూపర్ యంగ్‌గా కనిపిస్తున్నాడు. చక్కగా ఒక సైడ్‌కు దువ్విన జుట్టుతో, కొద్దిగా సిగ్గు పడుతూ.. చేతికి గడియారంతో, కళ్ల జోడు పెట్టి.. బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఏమైనా కొత్త్ లుక్‌లో ఉన్న చిరంజీవిని చూసి అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా షాక్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Koratala siva, Ram Charan, Surender reddy, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood, Upasana kamineni