మెగాస్టార్ చిరంజీవి మేకోవర్‌కు అసలు కారణం అక్కడికి వెళ్లడమేనా..?

చిరంజీవి ప్రస్తుతం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. సైరా కోసం బరువుతో పాటు గడ్డం కూడా పెంచిన ఈయన ఇప్పుడు నీట్ షేవ్‌లోకి వచ్చేసాడు. చాలా రోజుల నుంచి చిరు కొత్త లుక్‌లోనే కనిపిస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 14, 2019, 2:30 PM IST
మెగాస్టార్ చిరంజీవి మేకోవర్‌కు అసలు కారణం అక్కడికి వెళ్లడమేనా..?
చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్ (Instagram/Photo)
  • Share this:
చిరంజీవి ప్రస్తుతం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. సైరా కోసం బరువుతో పాటు గడ్డం కూడా పెంచిన ఈయన ఇప్పుడు నీట్ షేవ్‌లోకి వచ్చేసాడు. చాలా రోజుల నుంచి చిరు కొత్త లుక్‌లోనే కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే సైరా పనులన్నీ పూర్తి చేసాడు చిరంజీవి. ప్రస్తుతం ఈయన ఫోకస్ మొత్తం కొరటాల శివ సినిమాపైనే ఉంది. ఈ సినిమా కోసమే ఇప్పుడు హోమ్ వర్క్ చేస్తున్నాడు చిరు. ఈ చిత్ర కథ ప్రకారం మెగాస్టార్ బరువు తగ్గాల్సిందే. దానికోసం కృత్రిమ పద్దతిలో కాకుండా ఆయుర్వేదాన్ని నమ్ముకుంటున్నాడు చిరు. ఇప్పుడు కొరటాల సినిమా కోసమే ఈయన ప్రత్యేకంగా కేరళ వెళ్తున్నాడని తెలుస్తుంది.

Megastar Chiranjeevi heading to Kerala for Koratala Siva movie look and will take ayurvedic medicine pk చిరంజీవి ప్రస్తుతం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. సైరా కోసం బరువుతో పాటు గడ్డం కూడా పెంచిన ఈయన ఇప్పుడు నీట్ షేవ్‌లోకి వచ్చేసాడు. చాలా రోజుల నుంచి చిరు కొత్త లుక్‌లోనే కనిపిస్తున్నాడు. Chiranjeevi,Chiranjeevi twitter,Chiranjeevi instagram,Chiranjeevi new movie,Chiranjeevi sye raa movie,sye raa movie release date,Chiranjeevi sye raa release date,Chiranjeevi koratala siva,koratala siva new movie,koratala siva movies,Chiranjeevi kerala,Chiranjeevi kerala ayurvedam,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కేరళ,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి కొరటాల శివ ఫైల్ ఫోటో


గతంలో కూడా ఖైదీ నెం 150 సినిమా సమయంలో కేరళ వెళ్లొచ్చాడు చిరు. అక్కడే కొన్ని రోజులు ఉండి ఆయుర్వేద చికిత్స తీసుకుని వచ్చాడు. అప్పట్లో నాగార్జున దీన్ని చిరంజీవికి పరిచయం చేసాడని చెప్తారు ఇండస్ట్రీలో. బాగానే వర్కవుట్ కావడంతో అప్పట్నుంచి క్రమం తప్పకుండా చిరు కూడా కేరళ వెళ్లొస్తున్నాడు. ఇప్పుడు కూడా కొరటాల సినిమా కోసం బరువు తగ్గడానికి న్యాచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ తీసుకోనున్నాడు మెగాస్టార్. ఈ సినిమా అక్టోబర్‌లో పట్టాలెక్కనుంది. అప్పటి వరకు కచ్చితంగా కొత్త లుక్ తీసుకురానున్నాడు చిరంజీవి.
Megastar Chiranjeevi new look recharging fans and Here the Interesting story behind this look pk చిరంజీవి ప్రస్తుతం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. సైరా కోసం బరువుతో పాటు గడ్డం కూడా పెంచిన ఈయన ఇప్పుడు నీట్ షేవ్‌లోకి వచ్చేసాడు. చాలా రోజుల నుంచి చిరు కొత్త లుక్‌లోనే కనిపిస్తున్నాడు. Chiranjeevi,Chiranjeevi twitter,Chiranjeevi instagram,Chiranjeevi new movie,Chiranjeevi sye raa movie,sye raa movie release date,Chiranjeevi sye raa release date,Chiranjeevi koratala siva,koratala siva new movie,koratala siva movies,Chiranjeevi kerala,Chiranjeevi kerala ayurvedam,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కేరళ,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి ఫైల్ ఫోటో instagram.com/upasanakaminenikonidela

ఇప్పటికే ఈయన లుక్ వైరల్ అయిపోతుంది. చిరంజీవి బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నాడనే వార్తలు వినిపించినా కూడా కాదు.. పక్కా డైట్ ప్లాన్‌తోనే ఇది సాధ్యమైందని తెలుస్తుంది. కోడలు ఉపాసనతో పాటు రామ్ చరణ్ కూడా చిరు డైట్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కొరటాల సినిమాలో కూడా నయనతార హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం జరుగుతుంది. సైరాలో ఈమెతోనే జోడీ కట్టాడు చిరంజీవి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఓపెనింగ్ జరగనుంది. మరి చూడాలిక.. కేరళ ఆయుర్వేదం చిరంజీవి లుక్‌ను ఎలా మార్చేయనుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: August 14, 2019, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading