Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI NAGARJUNA VENKATESH MULTISTARER MOVIE TRIVENI SANGAMAM NOT WORK OUT FOR THESE REASONS TA

Chiranjeevi - Nagarjuna - Venkatesh : చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ భారీ మల్టీస్టారర్ ఎందుకు వర్కౌట్ కాలేదంటే.. తెర వెనక స్టోరీ ఇదే..

వెంకటేష్,చిరంజీవి,నాగార్జున (File/Photos)

వెంకటేష్,చిరంజీవి,నాగార్జున (File/Photos)

Chiranjeevi - Nagarjuna - Venkatesh : ప్రస్తుతం తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ వస్తున్నాయి. కానీ చరిత్రలో నిలిచిపోయే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల  ఓ భారీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది.

    Chiranjeevi - Nagarjuna - Venkatesh : ప్రస్తుతం తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ వస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో నందమూరి మెగా హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఒకే స్క్రీన్ పై నటింప చేయడంతో రాజమౌళి సక్సెస్ అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై ఇద్దరూ బడా మాస్ హీరోలు ఒకే సినిమాలో నటించడం అనేది ఈ సినిమాతోనే మొదలు. దాంతో పాటు పెద్ద, చిన్న హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యత ఉన్నా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా తమ హీరోను కాస్త తక్కువ చేసి చూపించరని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా దేశ వ్యాప్తంగా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘ఆచార్య’లో తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.

    అంతకు ముందు నాగార్జున, నాగ చైతన్య కలిసి చేసిన ‘బంగార్రాజు’ మూవీ ప్రేక్షకులను అలరించింది.  కానీ చరిత్రలో నిలిచిపోయే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల  ఓ భారీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు చిత్రసీమతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు.   ఐతే.. 2002లో ఇంద్ర సినిమా తర్వాత  తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేశారు కే.రాఘవేంద్రరావు. అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో భారీ మల్టీస్టారర్ మూవీని  తెరకెక్కించాలనకున్నారు. అది కూడా తన 100వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేలా ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నాడు.

    అంతేకాదు అప్పట్లో ఈ మల్టీస్టారర్ మూవీకి చిన్నికృష్ణ ఓ కథను కూడా రెడీ చేసి దర్శకేంద్రుడి ఇచ్చారు.  అంతేకాదు ఈ సినిమాకు ‘త్రివేణి సంగమం’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఈ చిత్రాన్ని కూడా మూడు హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో కథ, కథనాన్ని రెడీ చేసారు. అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది.  అంతా ఓకే అనుకున్నాకా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్నారు. ఈ  భారీ మల్టీస్టారర్ మూవీని అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడుతో పాటు, అల్లు అరవింద్, అశ్వనీదత్ నిర్మించడానికి రెడీ అయ్యారు.

    chiranjeevi nagarjuna venkatesh multistarer movie cancelled due to these reasons,chiranjeevi,nagarjuna,venkatesh,k raghavendra rao,chinni krihsna,chiranjeevi nagarjuna venkatesh multistarer movie,chiranjeevi twitter,venkatesh twitter,nagarjuna twitter,k raghavendra rao twitter,tollywood,telugu cinemam,chiranjeevi nagarjuna venkatesh triveni sangamam,చిరంజీవి,నాగార్జున,వెంకటేష్,త్రివేణి సంగమం,చిరంజీవి నాగార్జున వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ,త్రివేణి సంగమం, చిరంజీవి,కే రాఘవేంద్రరావు,చిన్నికృష్ణ
    చిరంజీవి,నాగార్జున,వెంకటేష్, (File/Photo)


    ఐతే.. క్లైమాక్స్.. ఇతరత్రా హీరో పరిచయం సన్నివేశాల  సీన్స్ కుదరకపోవడం వల్లే ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోవడం జరిగింది. ఒకవేళ ఈ సినిమాను రాఘవేంద్రరావు తెరకెక్కించనట్టైయితే.. తెలుగులో అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ అయి ఉండేది. ఆయన వంద చిత్రంగా చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మిగిలిపోయి ఉండేది. ఏమైనా ఒకే స్క్రీన్ పై చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లను చూడాలకున్న ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా తెరకెక్కకపోవడంతో నిరాశ తప్పలేదు. కానీ ఈ ముగ్గురు కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రిమూర్తులు’ సినిమాలో ఈ ముగ్గురుతో పాటు నందమూరి బాలకృష్ణ,కృష్ణ, కృష్ణంరాజు,శోభన్ బాబు ఓ పాటలో కలిసి నటించడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Nagarjuna Akkineni, Venkatesh

    తదుపరి వార్తలు