అమ్మ, ఆయి, మా.. ఇలా పదాలు .. పిలుపులు వేరైనా.. ఆ మాటలో కమ్మదనం మాత్రం ఎంతో మధురం. అమ్మ అనే పదానికి పిలుపునకు.. మరే ఏ పిలుపు సాటి రాదు. దేవుడు ప్రతీచోట ఉండలేకనే తల్లిని సృష్టించాడని అంటాడు. లోకంలో అందరికంటే మిన్న.. బిడ్డ కడుపులో పడడంతోనే తల్లిలో మాతృత్వం పొంగుకొస్తుంది. ఇక బిడ్డ భూమ్మీద పడిందంటే ఆ తల్లి తన సుఖ:దుఖ:లన్నింటిని పక్కన పెట్టేస్తోంది.
కుడి ఎడమ చేయి అన్న బేధం లేకుండా పిల్లల సేవలో నిమగ్నమై ఉంటుంది అమ్మ. ఆ ప్రేమను చాకిరీ అంటే పొరపాటే. ఆ సేవే తల్లికి సంతృప్తినిచ్చేది. జీవితం ధన్యమైనట్లు భావించేది అమ్మ. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకునేది అమ్మ. రాత్రిళ్ళు కూడా కలతనిద్రలో కనిపెట్టుకొని ఉంటుంది అమ్మ. బిడ్డ పక్క తడిపినా, పక్క కరాబు చేసిన గారాలబోతూ సరిచేస్తుంది అమ్మ. కన్ననాటి నుంచి కడతేరే దాకా నిరంతరం ప్రేమను పంచుతుంది అమ్మ. అలాంటి తల్లి కోసం... అమ్మ కోసం... అమ్మ పాత్రను గుర్తించిన ప్రపంచం ఆమె కోసం ఒక రోజును కేటాయించి ఆ రోజున అందరూ ఆమె గొప్పతనాన్ని స్మరించుకొనేలా చేస్తోంది. ప్రపంచ చరిత్రను చూస్తే మాతృదినోత్సవాన్ని ఒక వేడుకగా జరుపుకోవడం 1914లో మొదలైంది.
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022
మదర్స్ డేను ప్రతీ దేశం .. ప్రతీ వ్యక్తి ఘనంగా చేసుకుంటాడు. తన తల్లి ఈ లోకంలో ఉన్నా లేకున్నా.. గుర్తు చేసుకుంటాడు. తన మాతృమూర్తితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటాడు. ఎంతటి రాజైనా.. కూడా ఓ తల్లికి కొడుకేగా అంటారు. అలా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. ఓ తల్లికి బిడ్డే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తల్లితో గడినిప మధురమైన క్షణాల్ని వీడియో రూపంలో అభిమానులకు షేర్ చేశారు. ప్రపంచంలో తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్.
చిరు ఒక్కరే కాదు.. ఇందులో మెగా బ్రదర్స్ ముగ్గురు ఉన్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్... తమ తల్లి అంజనాదేవితో ఎంతో ఆనదంగా గడిపిన క్షణాల్ని వీడియోలో మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మన పవన్ కళ్యాన్ సాంగ్ పెట్టడం మరింత ఆసక్తిగా మారింది. పవన్ ఇటీవలే నటించిన వకీల్ సాబ్ మూవీ నుంచి... మగువ మగువ పాట .. మ్యూజిక్‌ను చిరు ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఉండేలా చూశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో... ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Mothers day, Nagababu, Pawan kalyan