• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGASTAR CHIRANJEEVI MOHAN RAJA LUCIFER REMAKE TITLE AS RARAJU OR KING MAKER HERE ARE THE DETAILS TA

Chiranjeevi: చిరంజీవి లూసీఫర్ రీమేక్ కోసం మరో పవర్ ఫుల్ టైటిల్ పరిశీలన..

Chiranjeevi: చిరంజీవి లూసీఫర్ రీమేక్ కోసం మరో పవర్ ఫుల్ టైటిల్ పరిశీలన..

చిరంజీవి లూసీఫర్ రీమేక్‌ కు పవర్‌ఫుల్ టైటిల్ (Twitter/Photo)

Chiranjeevi: చిరంజీవి విషయానికొస్తే.. ఈయన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆచార్య తర్వాత లూసీఫీర్ రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమా కోసం పవర్ ‌ఫుల్ టైటిల్ అనుకుంటున్నారు.

  • Share this:
    Chiranjeevi: చిరంజీవి విషయానికొస్తే.. ఈయన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్.. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిరు, చరణ్‌ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత చిరు.. లూసీఫర్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెలలోనే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి పలు క్రేజీ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఏ సినిమాకైనా టైటిలే ప్రధానం. పేరును బట్టి అది క్లాస్ మూవీనా.. మాస్ మూవీనా అని ప్రేక్షకులు కూడా ఓ అంచనాకు వస్తారు. అందుకే ఎంత మంచి సినిమా కైనా ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలంటే మంచి టైటిల్ ఉండాల్సిందే. తాజాగా చిరంజీవి కూడా తన చేయబోయే నెక్ట్స్ సినిమా ‘లూసీఫర్’ రీమేక్‌కు ఓ క్రేజీ టైటిల్‌ను అనుకుంటున్నారు.

    పూర్తి పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘రారాజు’ అనే టైటిల్ ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత అటు ‘బైరెడ్డి’, బిగ్ బ్రదర్’, బ్రహ్మరథం’ అంటూ రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా.. వాటిని తన కనుసైగలతో శాసిస్తూ ఉంటాడు. సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలో.. లేదో అతనే డిసైడ్ చేస్తాడు. ఈ నేపథ్యంలో ఈ  సినిమాకు ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చెబుతున్నారు.

    chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi acharya movie laahe laahe song,ఆచార్య ఫస్ట్ సాంగ్,ఆచార్య లాహే లాహే సాంగ్,చిరంజీవి ఆచార్య సాంగ్
    చిరంజీవి ఆచార్య సాంగ్ (Chiranjeevi Acharya)


    లూసీఫర్ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎంతో మందిని అనుకోని చివరకు తమిళంలో ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్న తెలుగువాడైన మోహన్ రాజాకు అప్పగించాడు. ఇక మోహన్ రాజా చేసిన దాదాపు అన్ని సినిమాలు రీమేక్ కథలు కావడం విశేషం. ఇక చిరు విషయానికొస్తే.. ఈ ఏజ్‌లో కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు.

    Chiranjeevi Lucifer remake,Chiranjeevi Lucifer remake actress,Chiranjeevi Lucifer remake trisha,Chiranjeevi Lucifer remake nayanthara,Chiranjeevi Lucifer remake trisha sister,Chiranjeevi Lucifer remake heroine,Chiranjeevi Lucifer remake title,Chiranjeevi Lucifer remake shooting,చిరంజీవి,చిరంజీవి లూసీఫర్ రీమేక్,చిరంజీవి త్రిష లూసీఫర్ రీమేక్,చిరంజీవి చెల్లిగా త్రిష
    చిరంజీవి లూసీఫర్ రీమేక్‌కు క్రేజీ టైటిల్ (Twitter/Photo)


    ‘లూసీఫర్’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీటైంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెలలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కరోనా  సెకండ్ వేవ్ నేపథ్యంలో మరి కొంత కాలం ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు్నాయి.  ఈ చిత్రంలో సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిఫుణులను త్వరలో  ఫైనలైజ్ చేసి అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.  ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లో ‘రారాజు’ బ్రహ్మరథం’, ’బిగ్ బ్రదర్’ 2కింగ్ మేకర్’ టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారు  నిర్మాతలు.

    Megastar Chiranjeevi With Directors Koratala Siva Meher Ramesh Mohan Raja Bobby photos goes Viral Chiranjeevi: కొరటాల శివ, మెహర్ రమేష్, మోహన్ రాజా, బాబీలతో మెగాస్టార్ చిరంజీవి..,chiranjeevi,Chiranjeevi Koratala Siva Meher Ramesh Mohan Raja Bobby,chiranjeevi twitter,chiranjeevi another remake,Chiranjeevi Koratala Siva,Chiranjeevi Bobby,Chiranjeevi Mohan Raja,chiranjeevi meher ramesh,meher ramesh,bobby,koratala siva,mohan Raja,chiranjeevi ajith ennai erindal,chiranjeevi prashanth varma movie,chiranjeevi acharya movie,chiranjeevi bobby movie,chiranjeevi sujeeth,chiranjeevi meher ramesh,chiranjeevi parasuram,chiranjeevi harish shankar movie,chiranjeevi ks ravindra movie,chiranjeevi ks ravindra mythri movie makers movie,chiranjeevi facebook,chiranjeevi sardar director bobby,chiranjeevi koratala siva movie,chiranjeevi about venky mama,chiranjeevi about venkymama,chiranjeevi next movie,chiranjeevi speech,chiranjeevi upcoming movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కెయస్ రవీంద్ర,చిరంజీవి మెహర్ రమేష్,చిరంజీవి హరీష్ శంకర్,చిరంజీవి పరశురామ్,చిరంజీవి సుజీత్,చిరంజీవి బాబీ సినిమా,చిరంజీవి ప్రశాంత్ వర్మ సినిమా,అజిత్ ఎంతవాడు కానీ సినిమాను రీమేక్ చేయనున్న చిరంజీవి,చిరంజీవి బాబీ,చిరంజీవి మోహన్ రాజా,చిరంజీవి మోహన్ రాజా లూసీఫర్,చిరంజీవి మెహర్ రమేష్,చిరంజీవి బాబీ,బాబీ,మోహన్ రాజా,కొరటాల శివ,మెహర్ రమేష్
    తన సినిమా దర్శకులతో మెగాస్టార్ చిరంజీవి


    మొత్తంగా చిరంజీవికి చిత్రానికి ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక దర్శకుడు మోహన్ రాజా విషయానికొస్తే.. ఈయన  రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమా ఒరిజినల్ ‘తనిఒరువన్’ దర్శకుడు కూడా. ఈయన తండ్రి ఎడిటర్ మోహన్.. తెలుగులో చిరంజీవితో అప్పట్లో హిట్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఇక మోహన్ రాజా దర్శకుడిగా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఆతర్వాత తన తమ్ముడు జయం రవితో వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తమిళంలో తన తమ్ముడితో తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. అంతేకాదు రీమేక్‌లను హ్యాండిల్ చేయడంలో మంచి పట్టు సాధించాడు మోహన్ రాజా. అందుకే చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలను మోహన్ రాజా చేతిలో పెట్టాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: