Chiranjeevi: తెలంగాణ గవర్నర్‌తో చిరంజీవి భేటి వెనక కారణాలు అవేనా..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. తెలంగాణకు గవర్నర్‌గా నియమితులైన తర్వాత చిరంజీవి..గవర్నర్‌ తమిళి సై తో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: October 6, 2019, 1:18 PM IST
Chiranjeevi: తెలంగాణ గవర్నర్‌తో చిరంజీవి భేటి వెనక కారణాలు అవేనా..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో చిరంజీవి భేటి (Whatsup/Photo)
  • Share this:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. తెలంగాణకు గవర్నర్‌గా నియమితులైన తర్వాత చిరంజీవి..గవర్నర్‌ తమిళి సై తో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెను పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి తాను నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విశేషాలను ఆమెతో పంచుకున్నారు. అంతేకాదు బ్రిటిష్ వాళ్లపై తొలి తిరుగుబాటు చేసినస్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘సైరా’ చిత్రాన్ని చూడమని కోరడం విశేషం. దీనిపై తమిళ సై సానుకూలంగానే స్పందించారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో చిరంజీవి భేటి (Whatsup/Photo)
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో చిరంజీవి భేటి (Whatsup/Photo)


కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్న చిరంజీవి.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమాతో పలకరించాడు. చిరంజీవి తెలంగాణ గవర్నర్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా చిరంజీవి బీజేపీలో జాయిన్ అవుతున్నరట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిని చిరంజీవి కూడా ఖండించారు. ఇప్పట్లో తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పినా.. మళ్లీ ఎన్నికల నాటికి బీజేపీ గూటికి చేరే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి చిరంజీవి ‘సైరా’ సినిమా విషయమై తెలంగాణ గవర్నర్‌ను కలిసినట్టు చెబుతున్నా.. ఇందులో రాజకీయ కోణం లేకపోలేదని  చెబుతున్నారు. మొత్తానికి చిరంజీవి.. తెలంగాణ గర్నవర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

First published: October 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు