• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGASTAR CHIRANJEEVI MEHER RAMESH VEDALAM REMAKE STARTS FROM NOVEMBER 18TH TA

Chiranjeevi-Meher Ramesh: చిరంజీవి, మెహర్ రమేష్ ‘వేదాలం’ రీమేక్‌కు ముహూర్తం ఖరారు..

Chiranjeevi-Meher Ramesh: చిరంజీవి, మెహర్ రమేష్ ‘వేదాలం’ రీమేక్‌కు ముహూర్తం ఖరారు..

చిరంజీవి, మెహర్ రమేష్ (Chiranjeevi meher ramesh/Photo)

MegaStar Chiranjeevi-Meher Ramesh | చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం సినిమా రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌కు ముహూర్తం ఖరారైంది.

  • Share this:
    MegaStar Chiranjeevi-Meher Ramesh | చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్  ఈ నెల 9 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అంతేకాదు వచ్చే యేడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరోవైపు చిరంజీవి.. మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ముందుగా సుజిత్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నా.. ఫైనల్‌గా ఈ రీమేక్ బాధ్యతలను వినాయక్ చేతిలో పెట్టారు చిరంజీవి. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముందుగా చిరంజీవి ఈ మెహర్ రమేష్ సినిమా చేయనున్నాడు.

    చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)
    చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)


    అంతేకాదు ఈ సినిమాను ఈ నెల 18న పూజా కార్యక్రమాలతో ప్రారంభించి రెండు నెలల్లో ఈ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు ఆచార్యలో చిరంజీవి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కూడా కొద్దిగానే మిగిలి ఉంది. రామ్ చరణ్‌తో పాటు మిగిలిన నటీ నటులతో కొన్ని కాంబినేషన్స్ సీన్ప్ మాత్రం మిగిలి ఉన్నాయి. మెహర్ రమేష్. చిరంజీవితో తెరకెక్కించే   ఈ చిత్రాన్ని కూడా చిరంజీవి, కొణిదెల ప్రొడక్షన్‌, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సంయుక్తంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఇప్పటికే గుండూతో ఉన్న ఫోటో షూట్ చేయించుకున్నాడు.

    గుండుతో చిరంజీవి (Instagram/Chiranjeevi)
    గుండుతో చిరంజీవి (Instagram/Chiranjeevi)


    దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  మెహర్ రమేష్ విషయానికొస్తే.. ఈయన. ఏడేళ్ల క్రితం వెంకటేష్‌తో షాడో సినిమా చేసాడు. ఆ తర్వాత మహేష్ బాబుకు సంబంధించిన యాడ్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇపుడు చాల ా యేళ్ల తర్వాత చిరంజీవిని దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: