Chiranjeevi-Meher Ramesh: చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి చాలా రోజుల కిందే బయటికి వచ్చింది. అయితే అది నిజం కాదేమో అని అభిమానులు అనుకున్నారు కానీ నిజంగానే ఈ కాంబినేషన్ కుదిరింది.
చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి చాలా రోజుల కిందే బయటికి వచ్చింది. అయితే అది నిజం కాదేమో అని అభిమానులు అనుకున్నారు కానీ నిజంగానే ఈ కాంబినేషన్ కుదిరింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా చేసుకుంటున్నాడు ఈ దర్శకుడు. స్క్రిప్ట్ సిద్ధం చేసి.. చిరంజీవితో అప్రూవల్ కూడా తెచ్చుకున్నాడు. మెహర్ చేసిన మార్పులకు చిరు కూడా ఫిదా అయిపోయాడు. అన్నీ ఓకే చేసుకుని బౌండెడ్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగాలని చూస్తున్నాడు మెహర్ రమేష్. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి ఈ దర్శకుడికి ఊహించని షాక్ ఇచ్చాడని తెలుస్తుంది.
చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)
అది విన్న తర్వాత మెహర్‌కు కూడా చుక్కలు కనిపించాయి. ఏంటది.. కొంపదీసి సినిమా కానీ క్యాన్సిల్ చేసాడా ఏంటి అనుకుంటున్నారా..? అదేం లేదు కానీ మరో షాక్ ఇచ్చాడు మెగాస్టార్. వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసే బాధ్యత మెహర్ చేతుల్లోనే పెట్టాడు కానీ అక్కడే కండీషన్స్ అప్లై అంటున్నాడు. అవి విన్న తర్వాత మెహర్ రమేష్ వామ్మో అనుకుంటున్నాడు. ఇంతకీ అదేంటంటే బడ్జెట్ కంట్రోలింగ్. ఈ సినిమా కోసం చాలా తక్కువ బడ్జెట్ కేటాయించాలని చూస్తున్నాడు చిరంజీవి. వీలైనంత తక్కువలోనే పూర్తి చేసి లాభాలు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్.
గుండుతో చిరంజీవి (Instagram/Chiranjeevi)
ఈ క్రమంలోనే పాతిక కోట్ల లోపే మెహర్ రమేష్‌కు బడ్జెట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగూ రీమేక్ కథ కావడం.. మినిమమ్ గ్యారెంటీ స్టోరీ కావడం.. మాస్ అప్పీల్ ఎక్కువగా ఉండటంతో కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్ముతున్నాడు చిరంజీవి. పైగా తాను కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. అందుకే సేఫ్ గేమ్ ఆడటానికి రీమేక్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎలాగూ మెహర్ రమేష్‌కు స్టైలిష్ మేకర్ అనే పేరుంది. తన సినిమాను కూడా మినిమమ్ గ్యారెంటీగా తీసినా పనైపోతుందని నమ్ముతున్నాడు మెగాస్టార్. అందుకే చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే మెహర్ రమేష్ కూడా చిరు ఇచ్చిన టాస్క్‌కు ఓకే అనేసాడు.
చిరంజీవి, సాయి పల్లవి (File/Photo)
వేదాళం రీమేక్ కోసం మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. దాంతో పాటు మిగిలిన టెక్నీషియన్స్ కూడా చాలా చిన్నవాళ్లే పని చేస్తున్నారు. ఈ సినిమా అంతా కేవలం చిరంజీవి ఇమేజ్‌పైనే నడవనుంది. చిరంజీవి ఇచ్చిన టాస్క్‌ను ధైర్యంగా తీసుకుని తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా సాయి పల్లవి నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఎలాగూ సొంత బ్యానర్ కాబట్టి చిరంజీవికి రెమ్యునరేషన్ ఉండదు.. మిగిలిన వాళ్లను తక్కువలోనే చుట్టేయాలని చూస్తున్నారు. మొత్తానికి చిరంజీవి కండీషన్స్ తట్టుకుని మెహర్ రమేష్ వేదాళం రీమేక్ ఎలా చేస్తాడో చూడాలి.