గోల్‌మాల్ చేస్తోన్న చిరంజీవి, రామ్ చరణ్.. ఇంతకీ ఏ విషయంలో తెలుసా..

ఔను మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు చిరుత అదేనండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గోల్‌మాల్ చేస్తున్నారు. ఇంతకీ వీళ్లిద్దరు కలిసి గోల్‌మాల్ చేస్తున్నది ఎవరో కాదు..

news18-telugu
Updated: May 31, 2019, 9:52 PM IST
గోల్‌మాల్ చేస్తోన్న చిరంజీవి, రామ్ చరణ్.. ఇంతకీ ఏ విషయంలో తెలుసా..
చిరు చరణ్ ఫేస్‌బుక్ ఫోటో (Source: Facebook)
  • Share this:
ఔను మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు చిరుత అదేనండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గోల్‌మాల్ చేస్తున్నారు. ఇంతకీ వీళ్లిద్దరు కలిసి గోల్‌మాల్ చేస్తున్నది ఎవరో కాదు.. దర్శకులను.. అవును రామ్ చరణ్‌తో ‘ధృవ’ సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ‘సైరా’ తర్వాత చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవతున్నాడు. మరోవైపు చిరుతో కొరటాల ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే రామ్ చరణ్‌..కొరటాల శివతో చేయబోయే ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. మరోవైపు అప్పట్లో చిరంజీవితో ‘ఠాగూర్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో రామ్ చరణ్..‘నాయక్’ సినిమా చేసాడు. అంతేకాదు మళ్లీ రామ్ చరణ్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’కు సినిమాకు వినాయక్ డైరెక్ట్ చేయడం విశేషం. ఈ రకంగా తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్‌లు తమతో పనిచేసిన దర్శకులను ఒకరి సినిమాలకు మరొకరు రికమెండ్ చేసుకుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 31, 2019, 9:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading