MEGASTAR CHIRANJEEVI MEETS LEGENDARY DIRECTOR K VISHWANATH ON DIWALI AND TAKEN GREETINGS PK
Chiranjeevi meets Vishwanath: దివాళీ రోజు K విశ్వనాథ్ ఆశీస్సులు తీసుకున్న చిరంజీవి..
చిరంజీవి విశ్వనాథ్ (chiranjeevi vishwanath)
Chiranjeevi meets Vishwanath: టాలీవుడ్లోని అందరు దర్శకులకు చిరంజీవి హాట్ ఫేవరేట్. ఒక్కసారి ఆయనతో కలిసి పని చేసిన తర్వాత మరిచిపోలేరు. ఆయన కూడా ఆ తరం దర్శకులను అంత బాగా చూసుకుంటాడు. ఇప్పటికీ తనకు హిట్స్ ఇచ్చిన..
టాలీవుడ్లోని అందరు దర్శకులకు చిరంజీవి హాట్ ఫేవరేట్. ఒక్కసారి ఆయనతో కలిసి పని చేసిన తర్వాత మరిచిపోలేరు. ఆయన కూడా ఆ తరం దర్శకులను అంత బాగా చూసుకుంటాడు. ఇప్పటికీ తనకు హిట్స్ ఇచ్చిన దర్శకులను బాగా గుర్తు పెట్టుకుంటాడు. అందరిలోనూ మరీ ముఖ్యంగా కళాతపస్వి విశ్వనాథ్ అంటే చిరుకు చాలా యిష్టం. ఆయన్ని తన తండ్రిలా చూసుకుంటాడు మెగాస్టార్. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్తుంటాడు. తెలుగు ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు కే విశ్వనాథ్. ఆయనతో పని చేయాలని చాలా మంది హీరోలు కలలు కంటుంటారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అందులో ఒకరు. ఆయన కల కెరీర్ కొత్తలోనే తీరింది. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు లాంటి సినిమాలు చేసాడు చిరంజీవి. వీటితో ఆయనకు నటుడిగా మరింత పేరు వచ్చింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు విశ్వనాథ్ అంటే చిరంజీవికి అంతే అభిమానం, గౌరవం ఉన్నాయి.
చిరంజీవి విశ్వనాథ్ (chiranjeevi vishwanath)
తాజాగా ఈయన కళాతపస్వి ఇంటికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు అందుకున్నాడు. దివాళీ సందర్భంగా విశ్వనాథ్ ఇంటికి సతీసమేతంగా వచ్చి వాళ్లకు బట్టలు పెట్టాడు మెగాస్టార్. ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూస్తుంటే వాళ్ల మధ్య ఉన్న అనుబంధం ఏంటో అర్థమవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.