రామ్ చరణ్ భామతో చిందేయనున్న చిరంజీవి..

ప్రస్తుతం చిరంజీవి.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్‌తో నటించిన భామను సంప్రదించినట్టు సమాచారం.

news18-telugu
Updated: March 16, 2019, 7:11 AM IST
రామ్ చరణ్ భామతో చిందేయనున్న చిరంజీవి..
చిరు చరణ్ ఫేస్‌బుక్ ఫోటో
  • Share this:
ప్రస్తుతం చిరంజీవి.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను ఈ ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే RRR ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైనట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శృతిహాసన్‌ను సంప్రదించినట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా శృతి హాసన్ ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఏదో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ కాలం గడిపేస్తోంది. మెగాస్టార్‌తో సినిమా అంటే ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. గతంలో మెగా ఫ్యామిలీ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో శృతిహాసన్ సినిమాలు చేసింది.

చిరంజీవి, శృతి హాసన్
చిరంజీవి, శృతి హాసన్


ఆయా చిత్రాలన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించాయి. మరోవైపు శృతి హాసన్ ..కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ సినిమా చేసింది. మరోవైపు మెగా ఫ్యామిలీతో శృతి హాసన్ మంచి రిలేషన్ ఉంది. మరోవైపు ‘కాటమరాయుడు’ తర్వాత తెలుగులో శృతి ఏ సినిమా సైన్ చేయలేదు. మరోవైపు ప్రియుడితో ఆమె రిలేషన్ బ్రేకప్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. సో.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు శృతి హాసన్ ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 

First published: March 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>