రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా.. ఇంతకీ బాస్ మనసులో ఏముంది..

చిరంజీవి రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా కూడా ఆయనని లాగడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అందులో భాగంగా బిజెపి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది కానీ చిరంజీవి మాత్రం పూర్తిగా సినిమాలకే పరిమితం కావాలని చూస్తున్నాడు. అసలు చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం ఉందా.. ఇంతకీ వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 26, 2019, 12:27 PM IST
రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా.. ఇంతకీ బాస్ మనసులో ఏముంది..
చిరంజీవి (File)
  • Share this:
చిరంజీవి రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా కూడా ఆయనని లాగడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అందులో భాగంగా బిజెపి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది కానీ చిరంజీవి మాత్రం పూర్తిగా సినిమాలకే పరిమితం కావాలని చూస్తున్నాడు. అసలు చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం ఉందా.. ఇంతకీ వివరాల్లోకి వెళితే.. 2009 ఎన్నికలకు సరిగ్గా ఎనిమిది నెలల ముందు చిరంజీవి.. తిరుపతి వేదికగా ‘ప్రజా రాజ్యం’ పార్టీని స్థాపించారు. అంతేకాదు ఆ సమయంలో తనకు గంజీ తెలుసు.. బెంజీ తెలుసు అంటూ సినిమాటిక్ డైలాగులు పలికి ప్రజలకు ఏదో చేస్తాడనే ఆశలు కల్పించాడు. ఇక రాజకీయాల్లోకి రాకముందు వరకు అందరివాడిగా అందరి మన్నలు అందుకున్నాడు చిరు. అంతేకాదు అప్పట్లో ఏ రాజకీయ నాయకుడు కూడా చిరంజీవిని పల్లెత్తు మాట అనడానికి కూడా జంకేవారు. చిరంజీవిని విమర్శిస్తే.. ఎక్కడ తమకు పొలిటికల్‌గా ఇబ్బంది కలుగుతోందో అని రాజకీయా నాయకుకలు ఆయనపై ఏమన్న మాట్లాడానికి జంకే వారు.

Celebrities Who Came to Politics From Cinema Industry.. సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కూడా పాలిటిక్స్‌లోకి వస్తున్నాడు. మరి ఇన్నేళ్లుగా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆ ప్రముఖులు ఎవరో ఒక్కసారి చూద్దాం.. sr ntr politics,mgr politics,prakash raj politics,vijayakanth politics,chiranjeevi politics,pawan kalyan politics,balakrishna politics,jayalalitha politics,Shatrughan Sinha politics,sunil dutt politics,telugu cinema,rajinikanth politics,kamal haasan politics,ఎన్టీఆర్ రాజకీయాలు,ఎమ్జీఆర్ రాజకీయాలు,చిరంజీవి రాజకీయాలు,పవన్ కళ్యాణ్ రాజకీయాలు,శత్రుఘ్నసిన్హా రాజకీయాలు,జయలలిత రాజకీయాలు,ప్రకాశ్ రాజ్ రాజకీయాలు,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
మెగాస్టార్.


ఇక 2009 ఎన్నికల్లో చిరంజీవికి చెందిన ప్రజా రాజ్యం పార్టీ తెలంగాణలో 2 రెండు సహా మొత్తంగా 18 సీట్లను గెలుచుకుంది. అంతేకాదు ఆ ఎన్నికల్లో చిరంజీవి..తిరుపతి, పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. అనూహ్యంగా పాలకొల్లు నుంచి చిరు ఓటమి పాలవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ప్రజా రాజ్యం పార్టీని నడపలేక..తన పార్టీని కాాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడై.. అప్పటి యూపీఏ2 లోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం స్వతంత్య్ర హోదాలో పర్యాటక శాఖ మంత్రి అయ్యారు. ఇక 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేయడంతో.. ఏపీలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది. ఆతర్వాత చిరంజీవి క్రమంగా రాజకీయాలపై ఆసక్తి తగ్గిస్తూ.. సినిమాల వైపు అడుగులు వేసాడు. ఇక రీ ఎంట్రీలో కూడా వెండితెరపై తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు చిరంజీవి. కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన జనసేన ఎన్నికల్లో పోటీ చేసింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలైయ్యారు. ఇక టీడీపీ కూడా 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది.

Is Mega Family not suituble for Politics and What About Ram Charan,pawan kalyan,pawan kalyan kalyan shows no effect in andhra pradesh,chiranjeevi,andhra pradesh news,andhra pradesh politics,pawan kalyan kalyan shows no effect in andhra pradesh Assembly lok sabha Elections,andhra pradesh news,prajarajyam,praja rajyam chiranjeevi,janasena chief pawan kalyan trailing,pawan kalyan no effect in ap elections,prakash raj trailing,election results 2019,live election result 2019,election results 2019 live,election result live today,2019 election results,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha election 2019 result,lok sabha election result,lok sabha election 2019 result live,election live results,election results,lok sabha election results 2019,election result 2019,lok sabha result,election 2019,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan craze,pawan kalyan fires on jagan,pawan kalyan janasena,pawan kalyan fans,pawan kalyan politics,pawan kalyan press meet,pawan kalyan public meeting,janasena pawan kalyan,janasena,pawan kalyan's jana sena,pawan kalyan jana sena party,janasena party,pawan kalyan janasena press meet,pawan kalyan janasena manifesto 2019,పవన్ కళ్యాణ్ వెనకంజ,భీమవరం,భీమవరం పవన్ కళ్యాణ్ ఏపీ లో జనసేన ప్రభావం శూన్యం,జనసేనతో పవన్ కళ్యాణ్,జనసేన,ప్రజా రాజ్యం,ప్రజా రాజ్యం చిరంజీవి,
చిరంజీవితో పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)


ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి..బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను మెగా క్యాంప్ ఖండించిన లోలోన మాత్రం ఆయన రాజకీయాల్లో కొనసాగాలనే ఆశలో ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద చిరంజీవి ఎక్కువలో ఎక్కువగా మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు సినిమాలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ కావాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే సరైన బీజేపీని సరైన వేదికగా భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ చిరంజీవి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే.. ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన కాపులను ఒక తాటిపైకి తీసుకురావవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి చిరంజీవి.. మళ్లీ రాజకీయాల్లో నిజంగానే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా.. ఒకవేళ రీఎంట్రీ ఇచ్చినా.. అందుకు బీజేపీని సరైన వేదికగా ఎంచుకుంటడా అనేది వేచి చూడాల్సిందే.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 26, 2019, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading