చిరంజీవి మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా...

Sye Raa | సైరా మూవీకి బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ పాజిటివ్ టాక్ వస్తే... కొరటాల డైరెక్షన్‌లో చిరంజీవి నటించబోయే సినిమా రేంజ్ కూడా పెరిగిపోతోంది.

news18-telugu
Updated: September 27, 2019, 7:52 PM IST
చిరంజీవి మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా...
సైరా పోస్టర్
news18-telugu
Updated: September 27, 2019, 7:52 PM IST
మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సైరా సినిమా హిస్టారికల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కావడంతో పాటు ఈ సినిమాలో అమితాబ్ సహా దక్షిణాదిలోని పాపులర్ స్టార్స్ నటించడమే ఇందుకు అసలు కారణం. భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించిన రామ్ చరణ్... బాలీవుడ్ సహా అన్ని భాషల్లోనూ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సైరా ప్రమోషన్స్ సంగతి ఎలా ఉన్నా... ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోందనే అంశంపై మెగా ఫ్యామిలీతో పాటు దర్శకుడు కొరటాల శివలోనూ ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ఒకవేళ సైరా మూవీకి బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ పాజిటివ్ టాక్ వస్తే... కొరటాల డైరెక్షన్‌లో చిరంజీవి నటించబోయే సినిమా రేంజ్ కూడా పెరిగిపోతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో తరహాలోనే చిరంజీవి కొరటాల శివ కొత్త సినిమాను దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్, నటీనటుల ఎంపిక ఉంటుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి కథను ఫైనలైజ్ చేసిన కొరటాల శివ... హీరోయిన్ సహా నటీనటుల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Sye raa,sye raa narasimha reddy,megastar chiranjeevi,koratala siva,director surendar reddy,chiranjeevi comments on politics,baahubali,saaho,ram charan,సైరా,సైరా నరసింహారెడ్డి,మెగాస్టార్ చిరంజీవి,కొరటాల శివ,సురేందర్ రెడ్డి,బాహుబలి,సాహో,చిరంజీవి కొత్త సినిమాపై సైరా ప్రభావం
చిరంజీవి న్యూ లుక్ (Instagram/Photo)


సైరా మూవీ చిత్ర యూనిట్ అంచనాలను అందుకుని అన్ని భాషల్లోనూ సక్సెస్ సాధిస్తే... చిరంజీవి కొరటాల మూవీలో తమిళంతో పాటు బాలీవుడ్ నటులను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని తెలుస్తోంది. అప్పుడు హీరోయిన్‌ విషయంలోనూ బాలీవుడ్‌కు ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. మొత్తానికి సైరా రిజల్ట్ ఎఫెక్ట్... చిరంజీవి, కొరటాల శివ కొత్త సినిమాపై ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...