MEGASTAR CHIRANJEEVI MALESIA TOUR FOR VALTERU VEERAYYA MOVIE SB
Chiranjeevi: చిరంజీవి సీక్రేట్ ఆపరేషన్.. మలేసియాకు మెగాస్టార్!
Chiranjeevi Photo : Twitter
వాల్దేరు వీరియ్య సినిమా షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మలేసియాలో ప్రారంభం కానుందని సమాచారం.దీంతో చిరు మలేసియాలో 20రోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మలేసియా వెళ్తున్నారు. 20 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. అయితే చిరు మలేసియా టూర్‌పై ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. ఆయన ఓ సీక్రేట్ ఆపరేషన్కోసమే విదేశాలకు ప్రయాణం అవుతున్నారని తెలుస్తోంది. చిరంజీవి హీరోగా వస్తున్న కొత్త సినిమా 'వాల్తేరు వీరయ్య'(Valteru Veerayya). దీంతో ఈ సినిమాలో ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసమే ఈ ప్రయాణం. టార్గెట్ ఎవరు? ప్లాన్ ఎలా డిజైన్ చేశారు ? అనే అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ఇది.
వాల్దేరు వీరియ్య(Valteru Veeryya) సినిమా షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మలేసియాలో ప్రారంభం కానుందని సమాచారం. జూన్ మొదటివారంలో లేదా రెండోవారం ప్రారంభంలో చిరంజీవి(Chiranjeevi), బాబీ(Bobby) అండ్ కో మలేసియాకు పయనం అవుతారు. సుమారు 20 రోజులు అక్కడ షూట్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ సినిమాకు ఈ షూటింగ్ కీలకమని సమాచారం. జీకే మోహన్, ఎమ్ ప్రవీణ్ సహనిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు కేథరిన్ త్రేజా, సముద్రఖని. బాబీ సింహాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారా.. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఆచార్య ఫెయిల్యూర్‌తో చిరంజీవి సైతం తాను చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అందరు దర్శకులకు తగిన జాగ్రత్తలు సూచించినట్టు తెలుస్తుంది. లూసిఫర్ రీమేక్ గా చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. సినిమా రష్ చూసిన చిరు కొన్ని మార్పులు చెప్పినట్టు తెలుస్తుంది. మెహెర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమా లో కూడా చిరంజీవి చాలా మార్పులు చేశారట. ఆల్రెడీ వేదాళం సినిమా తెలుగు ఆడియెన్స్ చూశారు. ఆ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాని ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.