చిరంజీవి మౌనం అందుకేనా.. అప్పటి వరకు నోరు విప్పడా..?

Chiranjeevi: ఎవరిపై అయినా చిన్న కామెంట్ చేస్తే వెంటనే క్లారిటీ ఇస్తుంటారు. తమపై ఒక్క మాట పడినా కూడా బయటికి వచ్చి కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తుంటారు కొందరు. కానీ చిరంజీవి మాత్రం అలా కాదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 30, 2020, 5:49 PM IST
చిరంజీవి మౌనం అందుకేనా.. అప్పటి వరకు నోరు విప్పడా..?
చిరంజీవి బయోపిక్ (Megastar Chiranjeevi Biopic)
  • Share this:
ఎవరిపై అయినా చిన్న కామెంట్ చేస్తే వెంటనే క్లారిటీ ఇస్తుంటారు. తమపై ఒక్క మాట పడినా కూడా బయటికి వచ్చి కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తుంటారు కొందరు. కానీ చిరంజీవి మాత్రం అలా కాదు. ఇండస్ట్రీలో ఎంత పెద్ద వివాదం అయినా కూడా చిరు అంత త్వరగా నోరువిప్పడు. కొంపలు అంటుకుపోయే కాంట్రవర్సీలు వచ్చినా కూడా ప్రశాంతంగా కనిపిస్తుంటాడు మెగాస్టార్. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. చిరు ఇల్లు కేంద్రంగా జరుగుతున్న చర్చలపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేసాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హైదరాబాద్‌లో అంతా భూములు పంచుకుంటున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలయ్య.

బాలయ్య లేకుండా చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్ (balakrishna chiranjeevi)
బాలయ్య లేకుండా చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్ (balakrishna chiranjeevi)


దీనిపై నాగబాబు వెంటనే స్పందించాడు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ బాలయ్యకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ ఇద్దరిపై తమ్మారెడ్డి సహా పలువురు ప్రముఖులు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎవరికి వాళ్లు అలా నోరు పారేసుకుంటే ఇండస్ట్రీలో పెద్దోళ్లు ఉండి ఏం లాభం అంటూ తమ్మారెడ్డి లాంటి వాళ్లు కాస్త సీరియస్ కూడా అయ్యారు. దాసరి ఉన్నపుడు ఆయన ఇంట్లో మీటింగ్స్ జరిగేవి.. ఇప్పుడు సిఎం కేసీఆర్ చెప్పాడు కాబట్టి చిరంజీవి ఇంట్లో జరుగుతున్నాయి.. అయినా చిరంజీవి స్వలాభం కోసం చేయట్లేదు కదా ఎందుకు ఏడుస్తున్నారంటూ కొందరు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.

చిరంజీవి (Megastar Chiranjeevi/Twitter)
చిరంజీవి (Megastar Chiranjeevi/Twitter)


అయితే తన పేరుతో ఇంత జరుగుతున్నా చిరంజీవి మాత్రం ఏం పట్టనట్లే ఉన్నాడు. ఇవన్నీ చిన్నచిన్న గొడలవని.. అలాంటి వాటికి సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే ఎప్పుడూ ఇదే పని చేస్తూ ఉండాలని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తుంది. అయినా ఇప్పటికే ఈ విషయంపై బాలయ్యతో కూడా చిరు మాట్లాడి క్లారిటీ ఇచ్చేసాడని ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే విషయాన్ని పెద్దది చేయడం యిష్టం లేక తన పని తాను చేసుకుంటున్నాడు మెగాస్టార్. బాలయ్య కామెంట్ చేసిన తర్వాత రోజే మరో మీటింగ్ కూడా జరిగింది. కొన్నాళ్లు కామ్‌గా ఉంటే అంతా సర్దుకుంటుంది.. అప్పుడు మాట్లాడితే సరి అనుకుంటున్నాడు చిరంజీవి.
First published: May 30, 2020, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading