Chiranjeevi : చిరంజీవి సినిమాకు హాలీవుడ్ టైటిల్.. ఆగస్టు 12 నుంచి షూటింగ్ షురూ..

Chiranjeevi Photo : Twitter

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 12 నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమంటే.. ఈ రీమేక్‌గా మొదటినుంచి రారాజుగా పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే సినిమాను ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అనేక పేర్లను పరిశీలించిన చిత్ర బృందం ఈ టైటిల్ వైపు మొగ్గు చూపిస్తుందని దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు. హిందీ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని తెలుస్తోంది. తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని, చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పాత్ర పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ లో విద్యాబాలన్ నటించనుందని తాజా సమాచారం. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. విద్యా బాలన్ తెలుగులో ఇప్పటికే  బాలయ్య హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే. మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పైగా హీరోయిన్ గా నయనతారను ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

    ఇక చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య పేరుతో తన 152వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం.

    ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఆచార్యలో చిరంజీవి సరసన ముందునుండి త్రిషను అనుకుంటే ఆమె ఏవో కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో కాజల్‌ను తీసుకుంది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    ఈ సినిమాతో పాటు చిరంజీవి తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ లో కూడా నటించనున్నారు. అజిత్ హీరోగా 2015లో వచ్చిన వేదాళం మూవీ తమిళ్‌లో భారీ విజయాన్ని నమోదుచేసుకుంది. ఆ సినిమాలో అజిత్ రోల్ అక్కడి ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. దీంతో ఆ పాత్రకు తనకు సూటవుతుందని భావించిన మెగాస్టార్ ఈ మూవీ రీమేక్ లో నటించనున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వ్యవహరిస్తాడని టాక్.
    Published by:Suresh Rachamalla
    First published: