Chiranjeevi: చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌కు అదిరిపోయే క్రేజీ టైటిల్‌ను అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఏ సినిమాకైనా టైటిలే ప్రధానం. పేరును బట్టి అది క్లాస్ మూవీనా.. మాస్ మూవీనా అని ప్రేక్షకులు కూడా ఓ అంచనాకు వస్తారు. అందుకే ఎంత మంచి సినిమా కైనా ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలంటే మంచి టైటిల్ ఉండాల్సిందే. తాజాగా చిరంజీవి కూడా తన చేయబోయే నెక్ట్స్ సినిమా ‘లూసీఫర్’ రీమేక్‌కు ఓ క్రేజీ టైటిల్‌ను అనుకుంటున్నారు. చిరంజీవి విషయానికొస్తే.. ఈయన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన లుక్ ఓ రేంజ్లో ఉందటుంటున్నారు మెగాభిమానులు. ఆ తర్వాత విడుదల చేసిన లాహే లాహే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆచార్య తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. లూసీఫర్ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎంతో మందిని అనుకోని చివరకు తమిళంలో ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్న తెలుగువాడైన మోహన్ రాజాకు అప్పగించాడు. ఇక మోహన్ రాజా చేసిన దాదాపు అన్ని సినిమాలు రీమేక్ కథలు కావడం విశేషం. ఇక చిరు విషయానికొస్తే.. ఈ ఏజ్‌లో కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు.
చిరంజీవి ఆచార్య సాంగ్ (Chiranjeevi Acharya)
‘లూసీఫర్’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీటైంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ రెండో వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిఫుణులను త్వరలో ఫైనలైజ్ చేసి అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు తెలుగులో ‘రారాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను రజిస్టర్ చేయించినట్టు సమాచారం. గతంలో కృష్ణంరాజు, గోపిచంద్ ఈ టైటిల్‌తో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే కదా.
తన సినిమా దర్శకులతో మెగాస్టార్ చిరంజీవి
మొత్తంగా పవర్‌పుల్ ‘రారాజు’ టైటిల్‌తో చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ దగ్గర మాయ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక మోహన్ రాజా కూడా ఈ చిత్రానికి ఈ టైటిల్ అయితే కరెక్ట్ గా ఉంటుందిన చెప్పాడట. దానికి చిరు కూడా ఓకే చెప్పటినట్టు సమాచారం. ఇక దర్శకుడు మోహన్ రాజా విషయానికొస్తే.. ఈయన రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమా ఒరిజినల్ ‘తనిఒరువన్’ దర్శకుడు కూడా. ఈయన తండ్రి ఎడిటర్ మోహన్.. తెలుగులో చిరంజీవితో అప్పట్లో హిట్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఇక మోహన్ రాజా దర్శకుడిగా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఆతర్వాత తన తమ్ముడు జయం రవితో వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తమిళంలో తన తమ్ముడితో తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. అంతేకాదు రీమేక్‌లను హ్యాండిల్ చేయడంలో మంచి పట్టు సాధించాడు మోహన్ రాజా. అందుకే చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలను మోహన్ రాజా చేతిలో పెట్టాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.