MEGASTAR CHIRANJEEVI LUCIFER REMAKE REGULAR SHOOTING STARTS FROM APRIL 2ND WEEK HERE ARE THE DETAILS TA
Chiranjeevi: చిరంజీవి ‘లూసీఫర్’ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేది అప్పటి నుంచే..
చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలు (Twitter/Photo)
MegaStar Chiranjeevim Lucifer Remake: ‘ఆచార్య’ తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ ‘వేదాళం’ సినిమాలను లైన్లో పెట్టాడు.ఇందులో ముందుగా ‘లూసీఫర్’ సినిమాను మొదలు పెట్టానున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేది ఎప్పటి నుంచి అంటే..
MegaStar Chiranjeevim Lucifer Remake : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో తనయుడు రామ్ చరణ్‌తో కలిసి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్ రాజమండ్రితో పాటు ఖమ్మంలో జరిగింది. ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి డీ హైడ్రేషన్‌కు గురయిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న చిరంజీవి.. త్వరలో ఆచార్యలో మిగిలిన షూటింగ్ పార్ట్‌ను ఈ నెలాఖరు వరకు కంప్లీట్ చేయనున్నారు. ‘ఆచార్య’ తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ ‘వేదాళం’ సినిమాలను లైన్లో పెట్టాడు.ఇందులో ముందుగా ‘లూసీఫర్’ సినిమాను మొదలు పెట్టానున్నారు.
ఇక లూసీఫర్ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎంతో మందిని అనుకోని చివరకు తమిళంలో ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్న తెలుగువాడైన మోహన్ రాజాకు అప్పగించాడు. ఇక మోహన్ రాజా చేసిన దాదాపు అన్ని సినిమాలు రీమేక్ కథలు కావడం విశేషం. ఇక చిరు విషయానికొస్తే.. ఈ ఏజ్‌లో కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు.
‘లూసీఫర్’ రీమేక్‌లో చిరంజీవి (File/Photo)
ముఖ్యంగా చిరు ప్రస్తుతం లూసీఫర్, వేదాళం రీమేక్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో వేదాళం కోసం మెహర్ రమేష్ ఫిక్స్ అయ్యాడు. ఆయన కథను కూడా సిద్ధం చేసాడు. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లు మెహర్ చేసిన మార్పులకు మెగాస్టార్ ఓకే కూడా చేసేసారు. రీసెంట్గా మెహర్ రమేష్ ఈ సినిమా షూటింగ్ చిరంజీవి లేకుండా మొదలు పెట్టాడు.
చిరంజీవి అజిత్ (chiranjeevi ajith)
‘లూసీఫర్’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీటైంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ రెండో వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్ మరో ముఖ్యపాత్రలో నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిఫుణులను త్వరలో ఈ నెలాఖరు వరకు ఫైనలైజ్ చేసి అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.
రు లూసీఫర్ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తోన్న మోహన్ రాజా (Twitter/Photo)
ఇక మోహన్ రాజా.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమా ఒరిజినల్ ‘తనిఒరువన్’ దర్శకుడు కూడా. ఈయన తండ్రి ఎడిటర్ మోహన్.. తెలుగులో చిరంజీవితో అప్పట్లో హిట్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఇక మోహన్ రాజా దర్శకుడిగా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఆతర్వాత తన తమ్ముడు జయం రవితో వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తమిళంలో తన తమ్ముడితో తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. అంతేకాదు రీమేక్‌లను హ్యాండిల్ చేయడంలో మంచి పట్టు సాధించాడు మోహన్ రాజా. అందుకే చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలను మోహన్ రాజా చేతిలో పెట్టినట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.