Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI LUCIFER REMAKE DIRECTOR MOHAN RAJA HERE ARE THE DETAILS TA

Chiranjeevi: చిరంజీవి లూసీఫర్ రీమేక్ బాధ్యతలు ఈ తమిళ దర్శకుడు చేతుల్లోకి.

చిరంజీవి (Twitter/Photo)

చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు మీదున్నాడు. అందులో భాగంగా మలయాళంలో హిట్టైన లూసీఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా రీమేక్ బాధ్యతలను తాజాగా ఓ తమిళ దర్శకుడి చేతిలో పెట్టినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
    Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు మీదున్నాడు. అంతేకాదు వరుసగా సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు.  ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న ఆచార్య షూటింగ్  రీసెంట్‌గా ప్రారంభమైంది. ఈ లోపు చిరంజీవికి కరోనా పాజిటివ్ అని మెగాస్టార్ స్వయంగా వెల్లడించారు.  ఆ తర్వాత కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో వెంటనే మరోసారి చెకప్ చేయించుకుంటే.. కరోనా లేదని నిర్ధారణ అయింది. కరోనా టెస్ట్ చేసే కిట్ ప్రాబ్లెమ్ వల్లే ఇదంత జరిగిందని చిరు చెప్పుకొచ్చారు. కొరటాల శివతో చేస్తోన్న సినిమా మాత్రమే డైరెక్ట్ స్టోరీ. ఆ తర్వాత చేయబోయే సినిమాలన్ని రీమేక్ సినిమాలే కావడం విశేషం. ఇప్పటికే అన్ని సినిమాలకు సంబంధించిన కథలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ ఏజ్‌లో కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ముఖ్యంగా చిరు ప్రస్తుతం లూసీఫర్, వేదాళం రీమేక్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో వేదాళం కోసం మెహర్ రమేష్ ఫిక్స్ అయ్యాడు. ఆయన కథను కూడా సిద్ధం చేసాడు. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లు మెహర్ చేసిన మార్పులకు మెగాస్టార్ ఓకే  కూడా చేసేసారు. త్వరలోనే ఈ సినిమా మొదలు కానుంది.

    vinayak walked out lucifer remake,chiranjeevi lucifer remake,chiranjeevi to remake lucifer movie,lucifer remake in telugu,megastar chiranjeevi looking to remake lucifer movie,chiranjeevi lucifer remake director,chiranjeevi bags remake rights of lucifer movie,vv vinayak to revive lucifer remake for chiranjeevi,megastar chiranjeevi,lucifer telugu remake,megastar chiranjeevi to remake lucifer,chiranjeevi ram charan lucifer movie,చిరంజీవి లూసీఫర్ రీమేక్,వినాయక్ లూసీఫర్ రీమేక్ చిరంజీవి,తెలుగు సినిమా
    చిరంజీవి అజిత్ (chiranjeevi ajith)


    ఇందులో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో తమిళనాట శివ తెరకెక్కించిన ఈ సినిమా మాస్ హిట్ అయింది. ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు మెహర్ రమేష్. వేదాళం విషయంలో క్లారిటీగా ఉన్న చిరు.. లూసీఫర్ రీమేక్ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఈ చిత్ర దర్శకుడి విషయంలో ముందు నుంచి కూడా ఎక్కడో క్లారిటీ మిస్ అవుతూ వస్తుంది. లూసీఫర్ రీమేక్‌కు ముందు సుజీత్‌ను దర్శకుడిగా తీసుకున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత సుజీత్‌ను కాదని వినాయక్‌ను తీసుకున్నాడు చిరంజీవి.

    చిరంజీవి వినాయక్ (Chiranjeevi Vinayak Lucifer movie remake)
    చిరంజీవి వినాయక్ (Chiranjeevi Vinayak Lucifer movie remake)


    అటు వినాయక్ చెప్పిన నేరేషన్ కూడా చిరంజీవికి నచ్చలేదట. ఆ తర్వాత బాబీ కూడా ఈ కథను తనదైన ట్రీట్మెంట్‌తో చిరును కలిస్తే.. అతని చెప్పిన విధానాకి కూడా చిరు సంతృప్తి వ్యక్త పరచలేదట. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ బాధ్యతలను చిరంజీవి.. హరీష్ శంకర్ చేతిలో పెడదామనుకున్నాడు. కానీ హరీష్ శంకర్ తనకున్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ  సినిమా రీమేక్ చేయలేనని చెప్పాడు. తాజాగా ఈ రీమేక్ బాధ్యతలను తమిళంలో వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళుతున్న మోహన్ రాజాకు అప్పగించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నాడట.

    చిరు లూసీఫర్ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్న మోహన్ రాజా (Twitter/Photo)


    ఇక మోహన్ రాజా.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమా ఒరిజినల్ ‘తనిఒరువన్’ దర్శకుడు కూడా. ఈయన తండ్రి ఎడిటర్ మోహన్.. తెలుగులో చిరంజీవితో అప్పట్లో హిట్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఇక మోహన్ రాజా దర్శకుడిగా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఇపుడు అక్కడు అగ్ర దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. మొత్తంగా లూసీఫర్ రీమేక్ విషయమై మోహన్ రాజా  పేరు అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Mohan Raja, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు