మెగాస్టార్ చిరంజీవితో ఆ పని చేయించిన ఆర్.నారాయణ మూర్తి..

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’. స్నేహచిత్ర పతాకం పై ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

news18-telugu
Updated: May 21, 2019, 9:21 PM IST
మెగాస్టార్ చిరంజీవితో ఆ పని చేయించిన ఆర్.నారాయణ మూర్తి..
మెగాస్టార్,పీపుల్స్ స్టార్
  • Share this:
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’. స్నేహచిత్ర పతాకం పై ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై ఈ మూవీ ఆడియోను లాంఛ్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి.. ఆర్.నారాయణ మూర్తితో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాలుగున్నర దశాబ్ధాలుగా ఆర్.నారాయణ మూర్తితో తనకు పరిచయం ఉందన్నారు. ఆర్.నారాయణ మూర్తికి సినిమాలంటే పిచ్చి. అంతేకాదు వేరే కమర్షియల్ సినిమాల్లో మంచి ఆఫర్లు ఉన్న..తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒకే బాటలో సినిమాలు చేయడం బహుషా ఆయనకు మాత్రమే చెల్లిందన్నారు. ఆయన పిలుపు మేరకు ఈ ఆడియో వేడుకకు వచ్చినట్టు చెప్పుకొచ్చారు చిరు. అంతేకాదు ఈ ఈవెంట్‌కు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిదన్నారు.  అందరు హీరోల్లా ఆర్.నారాయణ మూర్తి ఆస్తులు, అంతస్థులను నమ్ముకోలేదు. సినిమానే నమ్ముకున్నాడు. అంతేకాదు సినిమానే ప్రేమించాడు. దాన్ని పెళ్లిచేసుకొని సంసారం చేస్తున్నాడని మెగాస్టార్ చిరంజీవి.. ఆర్.నారాయణ మూర్తికి సినిమా పట్ల ఉన్న కమిట్‌మెంట్‌ను వివరించాడు. ఎక్కడ ఏ ఆడియో ఫంక్షన జరిగిన ఎక్కడ ఏమి తినని మెగాస్టార చిరంజీవితో ఆర్.నారాయణ మూర్తి పకోడిలు తినిపిచండం కొసమెరుపు.


First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...