శివ దర్శకత్వంలో చిరంజీవి..హీరోయిన్స్‌గా కీర్తి సురేష్, శృతి హాసన్

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో  ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌‌తో పాటు శృతి హాసన్‌ పేరును పరిశీలిస్తున్నారు.

news18-telugu
Updated: April 10, 2019, 2:59 PM IST
శివ దర్శకత్వంలో చిరంజీవి..హీరోయిన్స్‌గా కీర్తి సురేష్, శృతి హాసన్
ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం మొదలు కానుందనే ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు మాత్రం మరో రెండు నెలల తర్వాత కానీ చిరంజీవి, కొరాటల సినిమా పట్టాలెక్కదని వార్తలు వినిపిస్తున్నాయి.
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో  ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం..సైరాలో బీజీగా ఉన్నాడు. ఈ సినిమాను డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు..కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.  అయితే ఆ సినిమా పూర్తైయిన వెంటనే చిరంజీవి మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. 'సైరా' షూటింగ్ పూర్తయ్యాక ఒక నెల బ్రేక్ తీసుకొని ఆ తర్వాత కొరటాల శివ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు చిరు. సోషల్ డ్రామాగా తెరకెక్కనున్న..ఈ సినిమా  జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్నది. దీనికి సంబందించిన..పూర్తి స్క్రిప్టును ఈ మధ్యనే పూర్తి చేశాడు దర్శకుడు కొరటాల శివ.  అయితే ఈ సినిమా కోసం...చాలా మంది తెలుగు హీరోయిన్లను అనుకున్నారు.  వారీలో అనుష్క, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. దీనికి సంబంధించిన ఎలాంటీ అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కీర్తి సురేష్, శ‌ృతి హాసన్
కీర్తి సురేష్, శ‌ృతి హాసన్


తెలుగులో కీర్తి సురేష్ నటించిన 'మహానటి' బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో వచ్చిన ఆధరణ, క్రేజ్‌తో... ఇప్పుడు కీర్తి.. ఏకంగా మెగాస్టార్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని అందుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కిర్తీ సురేష్‌తో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌‌కు అవకాశం ఉందని..ఆ పాత్ర కోసం.. శృతి హాసన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.

కీర్తి సురేష్‌ లేటెస్ట్ ఫోటోస్
First published: April 10, 2019, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading