news18-telugu
Updated: December 3, 2020, 10:48 PM IST
‘ఆచార్య’ షూటింగ్లో తిరిగి జాయిన్ అయిన చిరంజీవి (Twitter/Photo)
Acharya-Chiranjeevi-Ram Charan | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోవిడ్ ఆంక్షల తర్వాత ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కావాలనుకున్నారు. ఈ లోగా చిరుకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో షూటింగ్లో జాయిన్ కాలేదు. ఆ తర్వాత కొరటాల శివ.. చిరంజీవి లేని సీన్స్‌ను షూట్ చేసారు. ఆ తర్వాత చిరంజీవికి కరోనా పాజిటివ్ కాకుండా నెగిటివ్ అని తేలడంతో మళ్లీ షూటింగ్ కోసం రెడీ అయ్యారు. తాజాగా చిరంజీవి ఈ గురువారం హైదరాబాద్ శివారులో ఉన్న ఆచార్య సెట్లో అడుగు పెట్టారు. ఈ రోజు షూటింగ్లో చిరంజీవిపై కొన్ని ఫైట్స్ సీన్స్‌ను చిత్రీకరించాడు కొరటాల శివ. చిరంజీవి కూడా ఈ వీకెండ్ ఆదివారం వరకు షూటింగ్లో పాల్గొని ఆ తర్వాత తమ్ముడు నాగబాబు తనయ నిహారిక పెళ్లి కోసం ఆచార్య టీమ్‌తో కలిసి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు.

చిరంజీవి, రామ్ చరణ్ (File/Photo)
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ షూటింగ్లో పాల్గొనే డేట్స్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇప్పటికే చెర్రీ ఈ సినిమా కోసం రాజమౌళి పర్మిషన్ కూడా తీసుకున్నాడట. ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్.. సంక్రాంతి తర్వాత 21 రోజుల బల్క్ డేట్స్ కేటాయించాడట. పొంగల్ తర్వాత కంటిన్యూగా ఈ సినిమా షూటింగ్లో చెర్రీ పాల్లొని తనకు సంబంధించిన సీన్స్ పూర్తి చేయనున్నాడట. గతంలో రామ్ చరణ్.. తన తండ్రితో కలిసి ‘మగధీర’, ‘బ్రూస్లీ’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇపుడు పూర్తి స్థాయిలో వీళ్లిద్దరు కలిసి నటించబోతున్న సినిమా ‘ఆచార్య’ కావడం విశేషం. ఈ సినిమాను రామ్ చరణ్.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారంలో కంప్లీట్ చేసి మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి.. ఏప్రిల్ 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 3, 2020, 10:48 PM IST