తారక్, చరణ్ స్నేహంతో పాటు రాజమౌళి ఆర్ఆర్ఆర్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాా చేస్తున్నారు. చాలా రోజులు తర్వాత తెలుగు తెరపై అసలు సిసలు మల్టీస్టారర్ మూవీగా ఇది రాబోతుంది. తాజాగా వీళ్లిద్దరి స్నేహంపై చిరంజీవి స్పందించారు.

news18-telugu
Updated: April 28, 2020, 8:05 PM IST
తారక్, చరణ్ స్నేహంతో పాటు రాజమౌళి ఆర్ఆర్ఆర్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఎన్టీఆర్, చరణ్‌ల స్నేహంపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు (Twitter/Photo)
  • Share this:
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాా చేస్తున్నారు. చాలా రోజులు తర్వాత తెలుగు తెరపై అసలు సిసలు మల్టీస్టారర్ మూవీగా ఇది రాబోతుంది. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్, మెగా (కొణిదెల) కుటుంబానికి చెందిన ఇద్దరు నటిస్తూ ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తొలిసారి ఇద్దరు బడా మాస్ హీరోలు కలిసి నటిస్తుండంపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇపుడిపుడే మన హీరోలు మారుతున్నారు. కథ డిమాండ్ చేస్తే ఒకే సినిమాలో కలిసి నటించడానికి వెనకాడటం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ల స్నేహం చూసి నాకు ఈర్ష్య కలుగుతోంది. వీళ్లిద్దరు ఇలాగే వారి బంధాన్ని కొనసాగించాలన్నారు. ఇక చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెష్ అందజేసారు. మరోవైపు తారక్ విసిరినా ‘బీ ది రియల్ మేన్’ ఛాలెంజ్‌ను స్వీకరించి దాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే కదా. చరణ్‌కు ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌తో పాటు ప్రభాస్, మహేష్ బాబులతో మంచి స్నేహం ఉందన్నారు.  నాకు కూడా తెలుగులో చాలా మంది మిత్రులున్నారు. బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు నాకు ఎంతో ఆప్తులు. వీళ్లతో మోహన్ బాబుతో సినిమాలు చేసాను. ఇక బాలయ్యతో నా స్నేహం ప్రత్యేకం. అంతేకాదు మేమిద్దరం ఎన్నో విషయాలు చర్చించుకుంటామని చెప్పుకొచ్చారు.

Telugu Heroes Like Chiranjeevi venkatesh Nagarjuna NTR Ram Charan Who Failed At Box Office With Their Own Name in movie titles,rrr,jr ntr,ram charan,jr ntr ram charan rrr,chiranjeevi,chiranjeevi twitter,balakrishna,nagarjuna,venkatesh,venkatesh venky mama,Vinaya vidheya rama telugu Heroes Who Failed At Box Office With Their Own Names As Title, Chiranjeevi, Tarak, NTR, Akhil, Nagarjuna ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్,చిరంజీవి,రామ్ చరణ్,నాగార్జున,వెంకటేష్,వెంకటేష్ వెంకీ మామ,వెంకీమామ,బాలకృష్ణ, రాంచరణ్ ఫోటోలు, రాంచరణ్ బోయపాటి శ్రీను, పేరు గొప్ప సినిమా దిబ్బ..సొంత పేరుకు బలై పోయిన స్టార్స్, ఎన్టీఆర్, చిరంజీవి, అఖిల్, నాగార్జున, టైటిల్‌లో పేరు పెట్టుకోవడానికి భయపడుతున్న టాలీవుడ్ స్టార్స్,అల్లు అర్జున్ బన్ని
జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ (ntr,ram charan News18 )


ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. బాహుబలితో పాటు అంతకు ముందు మగధీర వంటి సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. హీరో సెంట్రిక్‌గా ఉన్న సినిమాలను డైరెక్టర్ సెంట్రిక్‌గా మార్చిన ఘనుడు అని కొనియాడారు. అందరిలాగే నేను కూడా రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నాన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 28, 2020, 7:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading