Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI INTERESTING COMMENTS ON HIS FIRS LOVE SB

Chiranjeevi: చిన్నప్పుడే ప్రేమలో పడ్డా.. ఆ అమ్మాయిని అలా చూసేవాడ్ని..!

తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డానని చెప్పారు చిరంజీవి. ఒక అమ్మాయి తనకు సైకిల్‌ తొక్కడం నేర్పించేదని.. ఇక ఆ అమ్మాయిని చూస్తూ అలా ఉండిపోయేవాడినన్నారు చిరు.

  మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. చిరు అంటే ఆరాధించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.అయితే తాజాగా చిరు తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.  లాల్ సింగ్ చడ్డ సినిమాను చిరంజీవి తెలుగులో సమర్పిస్తున్న విషయం తెలిసింతే.  తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి, అమీర్ ఖాన్‌, నాగ చైతన్యలను టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. త్వరలో టెలీకాస్ట్‌ కానున్న ఈ ఇంటర్వ్యూ ప్రొమోను విడుదల చేశారు.

  ఈ ప్రొమోలో ఎన్నో ఆసక్తికర విషయాలను, నవ్వులను పంచుకున్నారు సెలబ్రిటీలు. 'లాల్ సింగ్‌ చద్దాలో అమీర్‌ ఖాన్ ఒక చిన్న పిల్లాడిలా, కాలేజ్‌ స్టూడంట్‌లా, ఆర్మీ ఆఫీసర్‌లా కనిపిస్తారు. ఈ టాన్స్ఫర్మేషన్‌ ఎలా జరిగింది' అని నాగార్జున ప్రశ్నించారు. దానికి వీఎఫ్‌ఎక్స్‌ వాళ్లు అంతా చేశారని అమీర్‌ ఖాన్‌ చెప్పగా.. 'ఈ మాటలు ఎడిట్‌ చేయండి' అని చిరంజీవి చెప్పడం సరదాగా అనిపించింది.  అయితే  ఈ క్రమంలోనే 'ఈ సినిమాలో పదేళ్ల వయసులోనే హీరో ప్రేమలో పడతాడు' అని నాగార్జున అన్న వెంటనే.. 'మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు?' అని చిరుని అమీర్‌ ఖాన్‌ అడుగుతారు. అప్పుడు చిరంజీవి 'ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఒక అమ్మాయి సైకిల్‌ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాంటిది ఆ అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్‌ తొక్కేవాడిని. అప్పుడు సైకిల్‌ తొక్కడంపై కాన్సంట్రేషన్‌ పక్కన పెట్టి ఆమెను చూసేవాన్ని. అప్పుడు ఆమె ముందు చూడు అంటూ నా ముఖాన్ని ముందుకు తిప్పేది' అని తెలిపారు. ఇప్పుడు చిరు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  అమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. సూపర్‌ హిట్టయిన హాలీవుడ్‌ మూవీ 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా వస్తోంది.  ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్‌ బాయ్‌ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ పాపులర్ డైరెక్టర్‌ అద్వైత్ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ ఇటీవల విడుదల కాగా మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. మూవీ విడుదల తేది దగ్గరపడనుండటంతో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్రబృందం. ఈ ప్రమోషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా జోరుగా పాల్గొంటున్నారు. అటు అమీర్ ఖాన్ కూడా హైదరాబాద్ వచ్చి మరీ లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Chiranjeevi, Megastar Chiranjeevi

  తదుపరి వార్తలు