Chiranjeevi: మెగాఫోన్ పట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ఎపుడో తెలుసా..

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనలో మంచి నటుడే కాదు మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. తాజాగా దర్శకత్వంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 18, 2019, 2:53 PM IST
Chiranjeevi: మెగాఫోన్ పట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ఎపుడో తెలుసా..
2
  • Share this:
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనలో మంచి నటుడే కాదు మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. తాజాగా ఆయన తెలుగులో ఒక ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకత్వానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అప్పట్లో కే.రాఘవేంద్రరావు ఈవినింగ్ ఆరు గంటల తర్వాత తన సినిమాలకు సంబంధించిన వేరే పనుల కోసం వెళ్లేవాడు. బాబాయ్.. ఈ సీన్ నీకూ తెలుసు కదా. అంటూ నాకు అప్పజెప్పి వెళ్లేవాడంటూ ఆనాటి విషయాలను చెప్పుకొచ్చారు. విజయ బాపినీడు,బి.గోపాల్ లాంటి వాళ్లకు నా మీద నమ్మకం ఎక్కువగా ఉండేది. ‘ఇంద్ర’ చిత్ర షూటింగ్ సమయంలో బి.గోపాల్ కొన్ని రోజులు ‘అల్లరి రాముడు’ సినిమా కోసం కేటాయించాల్సి వచ్చింది. అపుడు ‘ఇంద్ర’ సినిమాలోని కొన్ని సన్ని వేశాలను నేనే చిత్రకరించానన్నారు. ఆ తర్వాత చాలా మంది మీరు డైరెక్షన్ చేయోచ్చు కదా అని చాలా మంది అడిగారు. డైరెక్షన్ చేస్తూ నటన చేయడం నా వల్ల కాదు. ఒకవేళ డైరెక్షన్ చేయాల్సి వస్తే.. నటనను ఆపేయాల్సి ఉంటుంది. లేదంటే మిగిలిన విషయాల్లో రాజీ పడాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 18, 2019, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading