నితిన్‌కు కాబోయే భార్య కుటుంబంతో చిరంజీవి బంధం తెలుసా..?

Nithiin marriage: పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు ఈ మధ్యే సమాధానం ఇచ్చాడు నితిన్. సింగిల్ ఫరెవర్ నుంచి సింగిల్ ఫర్ నెవర్ అయిపోతున్నాడు ఈ కుర్ర హీరో. ఈయన చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 21, 2020, 3:29 PM IST
నితిన్‌కు కాబోయే భార్య కుటుంబంతో చిరంజీవి బంధం తెలుసా..?
నితిన్ చిరంజీవి షాలిని (nithiin shalini chiranjeevi)
  • Share this:
పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు ఈ మధ్యే సమాధానం ఇచ్చాడు నితిన్. సింగిల్ ఫరెవర్ నుంచి సింగిల్ ఫర్ నెవర్ అయిపోతున్నాడు ఈ కుర్ర హీరో. ఈయన చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని. నిశ్చితార్థం అయిన రోజు నుంచి ఈమె వివరాలను గూగుల్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. అసలు ఈమె ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చింది.. పైగా ప్రేమ వివాహం అంటున్నాడు అంటూ ఆరా తీస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందే కలవడం.. ఐదేళ్ల ప్రేమ.. ఇప్పుడు పెళ్లి ఇలా చాలా విశేషాలు చెప్పాడు నితిన్. ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటికి వచ్చింది. నితిన్ అత్తారింటికి చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయి.

నితిన్ చిరంజీవి షాలిని (nithiin shalini chiranjeevi)
నితిన్ చిరంజీవి షాలిని (nithiin shalini chiranjeevi)


షాలిని రెడ్డి కందుకూరి తెలంగాణలోని నాగర్ కర్నూల్ అమ్మాయి. అక్కడే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ కూతురు ఈ షాలిని. నాగర్ కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారు. అక్కడ ఈ హాస్పిటల్‌కు మంచి పేరుంది కూడా. వీళ్లది కూడా ప్రేమ వివాహమే. ఇప్పుడు వాళ్ల కూతురుకు కూడా ఇదే చేస్తున్నారు. అయితే వీళ్లకు చిరుతో సాన్నిహిత్యం బాగానే ఉంది. అయితే అది కేవలం రాజకీయపరంగా మాత్రమే.

నితిన్ చిరంజీవి షాలిని (nithiin shalini chiranjeevi)
నితిన్ చిరంజీవి షాలిని (nithiin shalini chiranjeevi)
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు నాగర్ కర్నూల్ నుంచి నూర్జహాన్ ఎమ్మెల్యే టికెట్ అందుకున్నారు. పార్టీ పెట్టగానే అందులో చేరింది నూర్జహాన్. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి నూర్జహాన్‌ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ప్రజారాజ్యం సంగతి అందరికీ తెలుసు. ఆమె కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ నితిన్, షాలిని పెళ్లితో మరోసారి నూర్జహాన్ వార్తల్లోకి వచ్చారు. తీరా ఆమె ఈమె ఒక్కరే అని తెలిసిన తర్వాత అంతా ఆశ్చర్యపోతున్నారు.
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు