టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతికి అభిమానులని ఉర్రూతలూగించేందుకు వచ్చేస్తుంది. యంగ్ దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరు నటించిన ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ తన టీంకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన పిక్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘హియర్ ఈజ్ ద పార్టీ ’ అంటూ మూవీ టీంతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పిక్‌లో చిరంజీవి , రవితేజతో పాటు.. డైరెక్టర్ బాబీతో, నిర్మాతలు రవిశంకర్, నవీన్ యేర్నేని, శేఖర్ మాస్టర్, రామ్-లక్ష్మణ్, వెన్నెల కిశోర్‌తోపాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందం ఉన్నారు. వీరిందరికీ చిరు పార్టీ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య టీం కోసం పార్టీ ఇక్కడ.. అంటూ పార్టీ మూడ్‌లో ఉన్నపుడు ఛిల్ అవుట్ అవుతూ టీంతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు చిరంజీవి. ఈ స్టిల్ నెట్టింట ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.
Here’s the Party ???? For Team #WaltairVeerayya pic.twitter.com/EPja5UvOJ4
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 2, 2023
ఇక ఈ సినిమాలో చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుండి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్లు, మోషన్ పోస్టర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు ఈ సినిమాలో రవితేజ నటించడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర నిడివి ఏకంగా 40 నిమిషాల పాటు ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటడంతో రవితేజ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాల్తేరు వీరయ్యలో చిరంజీవి చాలా రోజుల తరువాత ఊరమాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఆమె బాస్ పార్టీ సాంగ్‌లో మెరవనుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.