చిరంజీవి కుటుంబంలో సందడే సందడి.. హాజరైన పవన్ కళ్యాణ్ భార్య..

మెగాస్టార్ కుటుంబంలో పెద్ద ఫంక్షనే జరిగింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ చిన్నకూతురు నవిష్క అన్నప్రాసన కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది.

news18-telugu
Updated: August 26, 2019, 3:02 PM IST
చిరంజీవి కుటుంబంలో సందడే సందడి.. హాజరైన పవన్ కళ్యాణ్ భార్య..
మనవరాలితో చిరంజీవి (Twitter/photo)
  • Share this:
మెగాస్టార్ కుటుంబంలో పెద్ద ఫంక్షనే జరిగింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ చిన్నకూతురు నవిష్క అన్నప్రాసన కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి దంపతులతో పాటు చిరు పెద్ద కూతురు సుస్మితతో పాటు పవన్ కళ్యాణ్ భార్య తన కొడుకుతో సహా హాజరై సందడి చేసారు. ఈ వేడకలో చిరంజీవి .. తన మనరాలికి అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ.  ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి మెగా హీరోలతో పాటు చరణ్ వైఫ్ ఉపాసన మినహాయిస్తే.. మిగిలిన మెగా ఫ్యామిలీకి చెందిన మహిళలు  ఈ వేడుకలో సందడి చేసారు. ఎపుడో రెండు నెలల క్రితం జూన్ 19న జరిగిన ఈ వేడుక ఫోటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. చిరు ఇంట్లో జరిగిన ఈ అన్న ప్రాసన వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో మెగాభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.


First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు