హోమ్ /వార్తలు /సినిమా /

God Father Twitter Review: గాడ్ ఫాదర్ ట్విట్టర్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ అంటున్న నెటిజన్స్.. !

God Father Twitter Review: గాడ్ ఫాదర్ ట్విట్టర్ రివ్యూ.. బ్లాక్ బస్టర్ అంటున్న నెటిజన్స్.. !

 Chiranjeevi God Father Photo Twitter

Chiranjeevi God Father Photo Twitter

God Fahter: చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడులైంది. అయితే ఈ సినిమా ఫస్ట్ షోతోనే మంచి టాక్ తెచ్చుకుంది బాస్ ఈజ్ బ్యాక్ అంటూ... నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు, చిరంజీవి డైలాగ్స్, లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఆచార్య ప్లాప్‌తో ఎలాంటి అంచానలు పెట్టుకోకుండా చిరంజీవి గాడ్ ఫాదర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా విషయంలో మెగాస్టార్..ముందు నుంచి కాస్త కూల్‌గా ఉన్నారు. ఎక్కువగా హడావుడి చేయకుండా సింపుల్‌గా ప్రమోషన్లు చేపట్టి... గాడ్ ఫాదర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్‌కు ముందే గాడ్ ఫాదర్ పై పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీం.. ఊపిరి పీల్చుకున్నారు. గాడ్ ఫాదర్ మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్. తెలుగులో గాడ్ ఫాదర్‌ను మోహన్ రాజా తెరకెక్కించారు. అయితే దర్శకుడు మోహన్ రాజా కూడా లూసిఫర్ కంటే.. గాడ్ ఫాదర్ మరింత బెటర్‌గా ఉంటుందంటూ చెబుతూ వచ్చారు. ఆయన కూడా ఈసినిమాపై మంచి ఎక్స్‌పెర్టేషన్స్ పెట్టుకున్నారు. అంతా అనుకున్నట్లే గాడ్ ఫాదర్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. నెటిజన్లు ఈ సినిమాపై మంచి రివ్యూలు ఇస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది.

  గాడ్ ఫాదర్‌లో బాస్ ఎంట్రీ అదిరిపోయిందని అంటున్నారు నెటిజన్లు. చిరంజీవి ఎంట్రీకి సంబంధించిన విజువల్స్ తీసి నెట్టింట పెడుతూ హల్ చల్ చేస్తున్నారు. మరికొందరు బాస్ ఈజ్ బ్యాక్.. విత్ బ్యాంగ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆచార్య సినిమాకు అంచనాలతో వెళ్లామని.. సినిమా పోయిందని నిరాశ వ్యక్తం చేశామన్నారు. ఇప్పుడు మాత్రం గాడ్ ఫాదర్ సినిమాకు ఎలాంటి హోప్ పెట్టుకుండా వచ్చామన్నారు అయితే సినిమా చూసి చాలా బావుందని అంటున్నారు అభిమానులు. చిరంజీవి కేక పెట్టించారని వీడియోలు పెడుతున్నారు.

  మరోవైపు గాడ్ ఫాదర్‌లో చిరు పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయన్నారు. చిరు కళ్లపై కూడా ట్వీట్స్ పెడుతున్నారు. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందంటున్నారు. ఇక ఈ సినిమాలో ఆన్ స్క్రీన్ హీరో మెగాస్టార్ అయితే... ఆఫ్ స్క్రీన్ హీరో తమన్ అంటున్నారు. చిరంజీవి స్క్రీన్ ప్రజన్స్ కూడా అద్భుతంగా ఉందంటున్నారు.

  మరోవైపు గాడ్ ఫాదర్ సక్సెస్‌తో చిరు, మెగా అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. పలుచోట్ల బాణాసంచ కాల్చుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మోహన్ రాజా డైరెక్షన్ లో ఎన్వి ప్రసాద్, ఆర్బీ చౌదరి, రామ్ చరణ్ నిర్మాతలుగా గాడ్ ఫాదర్ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సునీల్, సముద్ర ఖని, పూరీ జగన్నాథ్ , గెటప్ శ్రీను వంటి వారి కీలక పాత్రలలో నటించారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Chiranjeevi, God father, God Father Movie

  ఉత్తమ కథలు