Chiranjeevi As God Father : అద్భుతమైన ప్రదేశంలో మొదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రెగ్యులర్ షూటింగ్..

‘గాడ్ ఫాదర్’ రెగ్యులర్ షూటింగ్ మొదలు (Twitter/Photo)

Chiranjeevi As God Father : అద్భుతమైన ప్రదేశంలో మొదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రెగ్యులర్ షూటింగ్.. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Chiranjeevi As God Father : అద్భుతమైన ప్రదేశంలో మొదలైన చిరంజీవిగాడ్ ఫాదర్’ రెగ్యులర్ షూటింగ్.. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ మూవీని ఎపుడో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ చేశారు. తాజాగా ఈ రోజు నుంచి ఊటీలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది. ‘గాడ్ ఫాదర్’ విషయానికొస్తే.. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.

    ఈ సినిమా మలయాలంలో సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.


    మాతృకలో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నాడట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.  ఈ సినిమాలో ముందుగా విద్యాబాలన్‌ను చిరు చెల్లెలు పాత్ర కోసం అనుకున్నారు. కానీ ఫైనల్‌గా  ఈ చిత్రంలో రమ్యకృష్ణ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

    బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

    సెకండ్ ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ వరుసగా డిఫరెంట్ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. బాహుబలిలో శివగామిగా అలరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు చిత్రాలున్నాయి. ‘లైగర్’, ’రంగమార్తాండ’, రిపబ్లిక్, బంగార్రాజు సహా పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇపుడు చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో రమ్యకృష్ణ .. చిరు చెల్లెలుగా కీలక పాత్రలో అలరించనుంది.

    చిరంజీవి, రమ్యకృష్ణ (Twitter/Photo)


    గతంలో రమ్యకృష్ణ .. చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘అల్లుడా మజాకా’, ‘ఇద్దరు మిత్రులు’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఇపుడు చాలా యేళ్ల తర్వాత చిరుకు చెల్లెలు పాత్రలో కనిపించనుంది.

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    గతంలో తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ హీరోలుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది.  ఇపుడు చిరంజీవి హీరోగా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో వస్తోన్న రెండో సినిమా.‘గాడ్ ఫాదర్’ సినిమాలో మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. మరోవైపు వరుణ్ తేజ్.. చిరంజీవి బ్రదర్ పాత్రలో సీఎంగా కాసేపు అలరించనున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: