అయ్యో చిరంజీవికి ఏమైంది.. ఇలా అయిపోయాడేంటి..?

Chiranjeevi Weight Loss: లాక్‌డౌన్ కదా అని ఇంట్లోనూ ఉండి బరువు పెరిగిపోతున్నారు కొందరు హీరో హీరోయిన్లు. అలాంటి వాళ్లకు చిరంజీవిని చూపిస్తే సరిపోతుంది. ఆయన వయసు 64 ఏళ్లంటే నమ్మడం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 10:55 PM IST
అయ్యో చిరంజీవికి ఏమైంది.. ఇలా అయిపోయాడేంటి..?
చిరంజీవి కేసీఆర్ (Chiranjeevi KCR)
  • Share this:
లాక్‌డౌన్ కదా అని ఇంట్లోనూ ఉండి బరువు పెరిగిపోతున్నారు కొందరు హీరో హీరోయిన్లు. అలాంటి వాళ్లకు చిరంజీవిని చూపిస్తే సరిపోతుంది. ఆయన వయసు 64 ఏళ్లంటే నమ్మడం సాధ్యం కాదు. అసలు చిరు అంటే తెలియని ఎవరైనా కొత్త వాళ్లకు చూపించి ఆయన వయసెంత అంటే సగానికి సగం తగ్గించేస్తారేమో..? అంత యంగ్‌గా మారిపోతున్నాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి లుక్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. దానికంటే ముందు షాక్ అయిపోతున్నారు. ఈయన ఉన్నట్లుండి చాలా బరువు తగ్గిపోయాడు. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరంజీవి.
చిరంజీవి ఆచార్య సినిమా లుక్ (Chiranjeevi Acharya movie)
చిరంజీవి ఆచార్య సినిమా లుక్ (Chiranjeevi Acharya movie)


దీని తర్వాత లూసీఫర్ తెలుగు రీమేక్ చేయనున్నాడు. అయితే లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండి అన్ని పనులతో పాటు జిమ్ కూడా తూచా తప్పకుండా చేస్తున్నాడు చిరు. అందుకే మరింత ఫిట్‌గా కనిపిస్తున్నాడు మెగాస్టార్. తాజాగా కేసీఆర్‌తో మీటింగ్‌కు వచ్చిన చిరంజీవిని చూసి అంతా షాక్ అయ్యారు. మునపటితో పోలిస్తే చాలా సన్నబడ్డాడు చిరంజీవి.
చిరంజీవి కేసీఆర్ (Chiranjeevi KCR)
చిరంజీవి కేసీఆర్ (Chiranjeevi KCR)

ఇదంతా ఆచార్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమే అంటున్నారు. రామ్ చరణ్‌తో కలిసి వచ్చే సన్నివేశాల కోసమే చిరు ఇలా బరువు తగ్గిపోయాడని తెలుస్తుంది. మరోవైపు లూసీఫర్ తెలుగు రీమేక్ కోసం కూడా సన్నగానే కనిపించబోతున్నాడు అన్నయ్య. ఏదేమైనా కూడా ఇప్పుడు చిరు కొత్త లుక్ కేక పెట్టిస్తుంది.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading