నన్ను, నా తమ్ముడ్ని చూడండి.. రజినీ, కమల్‌కు చిరంజీవి స్వీట్ వార్నింగ్..

చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. పదేళ్ల పాటు తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న అన్నయ్య.. ఇప్పుడు మళ్లీ తనదైన శైలిలో విజృంభిస్తున్నాడు. సైరా సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్న చిరు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 26, 2019, 8:05 PM IST
నన్ను, నా తమ్ముడ్ని చూడండి.. రజినీ, కమల్‌కు చిరంజీవి స్వీట్ వార్నింగ్..
చిరంజీవి రజినీకాంత్ కమల్ హాసన్ (Source: Twitter)
  • Share this:
చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. పదేళ్ల పాటు తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న అన్నయ్య.. ఇప్పుడు మళ్లీ తనదైన శైలిలో విజృంభిస్తున్నాడు. సైరా సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్న చిరు.. తన తోటి నటులైన రజినీ, కమల్ హాసన్‌కు ఓ విషయంలో విలువైన సలహా ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రజినీ, కమల్ కూడా సినిమాలు చేస్తున్నారు. రజినీ వరస సినిమాలతో రప్ఫాడిస్తున్నాడు కూడా. అయితే వీళ్లు సినిమాలో పాటు రాజకీయాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అనే పార్టీని కూడా స్థాపించాడు.

చిరంజీవి రజినీకాంత్ (Source: Twitter)


ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పార్టీ పనులు కూడా చూసుకుంటున్నాడు లోకనాయకుడు. మరోవైపు రజినీ కూడా ఇప్పుడు కాకపోతే మరో ఏడాది తర్వాతైనా రాజకీయాల్లో బిజీ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే తాను పాలిటిక్స్‌లోకి వస్తున్నట్లు చెప్పాడు సూపర్ స్టార్. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలకు తనదైన సలహా ఇచ్చాడు మెగాస్టార్. స్వీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని.. రజినీ, కమల్‌కు రాజకీయాలు వద్దని వారించినట్లు తెలుస్తుంది.

చిరంజీవి పవన్ కల్యాణ్ కమల్ హాసన్ రజినీకాంత్ (Source: Twitter)
ప్రస్తుత రాజకీయాలన్నీ ధన, కుల ప్రవాహంలో ఉండటంతో ఎంత సూపర్ స్టార్స్ వచ్చినా కూడా తట్టుకోవడం కష్టమని వాళ్లకు మెగాస్టార్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. దానికి తనతో పాటు తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా నిదర్శనమని.. తమని చూసిన తర్వాతైనా రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనను మానుకోవాలని వాళ్లను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. ఘోరంగా ఓడిపోయాడు చిరు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసాడు. అందుకే ఇప్పుడు తమిళ హీరోలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>