‘సుప్రీం’ తర్వాత సరైన సక్సెస్ లేని సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించలేకపోయాయి. దీనితో హీరోగా రేసులో వెనకబడ్డాడు. ఒకటి రెండా కాదు.. వరసగా ఆరు ఫ్లాపులు.. ఇన్ని ప్లాపులు వస్తే కనీసం ఆ హీరో సినిమా చూడ్డానికి కూడా ప్రేక్షకులు థియేటర్స్ వైపు రారు. కానీ సాయి ధరమ్ తేజ్ విషయంలో మాత్రం ‘చిత్రలహరి’ సినిమాతో ఆడియన్స్‌ను మాయ చేసాడు. ‘చిత్రలహరి’తో చాలా ఏళ్ల తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా సక్సెస్‌లో మావయ్య చిరంజీవి చేసిన సూచనలు, సలహాలు ఈ మూవీ సక్సెస్‌లో బాగా ఉపయోగపడ్డాయి. అంతకు ముందు తనకు తోచిన రీతిలో సినిమాలు చేసి వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాడు సాయి ధరమ్ తేజ్. ‘చిత్రలహరి’ ఇచ్చిన సక్సెస్‌తో సాయి ధరమ్ తేజ్.. ఇపుడు మారుతి దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్టేనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్.. తన పెద మేనమామ మెగాస్టార్ చిరంజీవి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాడు.
ఎందుకంటే హీరోగా సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్లంప్‌లో ఉన్నపుడు చిరంజీవి చేసిన సూచనలు ‘చిత్రలహరి’ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. అంతేకాదు ఈ సినిమా సూపర్ హిట్టైయింది. అందుకే ఇపుడు మరోసారి మామ సలహాతో మెగా హిట్ కొట్టాలనే కసిమీదున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. మరి కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిత్రలహరి’ సినిమాకు వర్కౌట్ అయిన చిరంజీవి సలహాలు.. ఇపుడు మారుతి సినిమాకు కూడా వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Chitralahari Movie Review, Kishore Tirumala, Maruthi, Megastar, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood