అభిమాని వింత కోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును నిరూపించుకున్నాడు. ఇక చిరంజీవి కూడా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అభిమానులకు కాస్తంత టైమ్ కేటాయిస్తుంటాడు. తాజాాగా ఓ అభిమాని వింత కోరికను తీర్చి వార్తల్లో నిలిచారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 22, 2019, 6:43 PM IST
అభిమాని వింత కోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి..
చిరంజీవి (ఫైల్ ఫోటో)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును నిరూపించుకున్నాడు. ఇక చిరంజీవి కూడా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అభిమానులకు కాస్తంత టైమ్ కేటాయిస్తుంటాడు. తాజాగా చిరంజీవి తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరావు  అభిమాని కోరిక తీర్చి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. తాజాగా చిరంజీవి అభిమాని ఒకరు తన కొడుకుకు చిరంజీవి చేతుల మీదుగానే నామకరణం చేయాలని పట్టుపట్టి కూర్చుకున్నాడు. ఎవరెంత చెప్పినా స్వయంగా చిరంజీవే తన కొడుకుకు పేరు పెట్టాలని భీష్మించుకుని కూర్చున్నాడు. ఐతే ఎలాగోలా ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లడంతో ఆయన పెద్ద మనసు చేసుకొని అతన్ని తన ఇంటికి పిలుపించుకున్నాడు. అంతేకాదు ఆ పిల్లాడికి తన అసలు పేరు, తమ్ముడి పేరు స్పురించేలా పవన్ శంకర్ అనే నామకరణం చేసారు.

Megastar chiranjeevi fulfill his fan ambition,chiranjeevi,megastar chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi twitter,chiranjeevi instagram,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,chiranjeevi,sye raa narasimha reddy movie,chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy trailer,surender reddy,megastar chiranjeevi,chiranjeevi sye raa narasimha reddy movie,sye raa narasimha reddy songs,sye raa narasimha reddy first look,sye raa narasimha reddy movie updates,sye raa narasimha reddy official teaser,chiranjeevi fullfill his fan ambition,chiranjeevi ram charan prajarajyam,jabardasth comedy show,bigg boss 3,tollywood,telugu cinema,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి అప్‌డేట్స్,అభిమాని కోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
అభిమాని కుటుంబంతో మెగాస్టార్ చిరంజీవి


దీంతో సదరు అభిమాని చిరంజీవి చేసిన పని వల్ల ఎంతో ఆనందించాడు. ఇపుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నక్కా వెంకటేశ్వరావు..చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఆ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. అప్పట్లో ఆయన గ్రామ ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా రాజ్యం కోసం పనిచేయడంతో ఆయన్ని గ్రామస్థులు 5 సంవత్సరాలు వెలివేయడం జరిగింది. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి..అతని కుటుంబ సభ్యులను పిలుపించుకొని బట్టలు పెట్టారు కూడా. కాగా గతేడాది నక్కా వేంకటేశ్వరరావుకు ఇదే నెలలో బాబు పుట్టాడు. ఆ పిల్లాడికి చిరంజీవే నామకరణం చేయాలని పట్టుపట్టాడు. దీంతో ఈ  సోమవారం చిరంజీవి నుంచి పిలుపు రావడం ఆయన వెళ్లడం నామకరణం జరిగిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 22, 2019, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading