అనారోగ్యంతో బాధ పడుతున్న చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శం. చిరుతో తొలి చిత్రం తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కుమార్.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.

news18-telugu
Updated: November 16, 2019, 7:27 AM IST
అనారోగ్యంతో బాధ పడుతున్న చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు..
చిరంజీవి (File photo)
  • Share this:
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శం. తెలుగులో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజుల తర్వాత స్వయంకృషితో హీరోగా ఎదిగి టాలీవుడ్‌లో ఆయనకంటూ ఒక పేజీ క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. ఇప్పటికే 151 సినిమాల మైలురాళ్లు అందుకున్న చిరంజీవి.. నటుడిగా కెరీర్ ప్రారంభమైంది పునాది రాళ్లు సినిమాతోనే. ఈ చిత్రంతో తొలిసారి మొఖానికి రంగేసుకున్న విడుదలైన మొదటి చిత్రం మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ఆ సంగతి పక్కనపెడితే.. చిరంజీవికి నటుడిగా ‘పునాదిరాళ్లు’ సినిమాతో అవకాశం ఇచ్చిన దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్. తొలి సినిమాతోనే 5 నంది అవార్డులు అందుకొని ఔరా అనిపించాడు. గంగిగోవు గోవు పాలు గరిటడైనను చాలు అన్నట్టు తీసినవి కొన్ని చిత్రాలే అయినా.. అన్ని సామాజిక ఇతివత్తాలన్న చిత్రాలనే తెరకెక్కించాడు. దాంతో ఈ దర్శకుడు ఆర్ధికంగా చితికిపోయాడు. అంతేకాదు ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో కన్నుమూయడం. ఆతర్వాత సతీమణి కూడా కాలం చేయడం ఆయన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. చెప్పుకోవడానికి ఏమైనా ఉందంటే.. చిరంజీవితో మొదటి సినిమా తెరకెక్కించనన్న సంతోషం మాత్రమే. ప్రస్తుతం రాజ్ కుమార్.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.

chiranjeevi first movie punadhirallu movie director rajkumar not well he wanted financial support,chiranjeevi,chiranjeevi movies,megastar chiranjeevi,chiranjeevi hit movies,mega star chiranjeevi,chiranjeevi,chiranjeevi movies,mega star chiranjeevi,megastar chiranjeevi,chiranjeevi hit songs,chiranjeevi songs,chiranjeevi hit movies,chiranjeevi dance,chiranjeevi full movies,chiranjeevi first movie,chiranjeevi video songs,chiranjeevi (politician),chiranjeevi first cinema,chiranjeevi telugu movies,chiranjeevi first movie chance,chiranjeevi punadhirallu,chiranjeevi punadhirallu movie,konidala chiranjeevi,about chiranjeevi,chiranjeevi rajkumar,rajkumar chiranjeevi,tollywood,telugu cinema,చిరంజీవి,చిరంజీవి పునాదిరాళ్లు,పునాదిరాళ్లు,పునాదిరాళ్లు,పునాదిరాళ్లు దర్శకుడు రాజ్‌కుమార్,చిరంజీవి దర్శకుడు అస్వస్థత
పునాదిరాళ్లు చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ (File Photo)


అంతేకాదు వైద్యం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, గీత రచయతగా, కథా రచయతగా పనిచేసినా ఇప్పటికీ ఫిల్మ్ నగర్‌లో కానీ, చిత్రపురి కాలనీలో ఆయనకు  సొంతిల్లు అంటూ లేదు. దీంతో కిరాయి ఇంట్లో కాలం గడుపుతున్నాడు. తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడంతో రెండు కొడుకు కష్టంతో బతుకు వెళ్లదీస్తున్నాడు. మరి ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవి ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.
First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading