Chiranjeevi - Rajasekhar : మెగాస్టార్ చిరంజీవిని ఆశ్యర్యపోయేలా చేసిన రాజశేఖర్.. అవును హీరో రాజశేఖర్ తన తోటి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవిని ఆశ్యర్యపోయేలాా చేసారు. వివరాల్లోకి వెళితే.. హీరో రాజశేఖర్ తన కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా సీరియస్ పాత్రలు చేయడంతో ఈయనకు యాంగ్రీ యంగ్ మెన్ అనే బిరుదు వచ్చింది. అయితే.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎపుడైతే.. ‘అల్లరి ప్రియుడు’ సినిమా అనౌన్స్ అయిందో అప్పటి నుంచి ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పైగా రాఘవేంద్రరావు యాక్షన్, రొమాన్స్, కామెడీ కాకుండా అన్ని జానర్స్‌లో సినిమాలు తీయడంలో దిట్ట. ఇక యాంగ్రీ యంగ్‌మెన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్‌తో సినిమా అంటే ఏదో యాక్షన్ జానర్‌లో సినిమా తీస్తాడనుకుంటే.. ‘అల్లరి ప్రియుడు’ అంటూ రొమాంటిక్ మూవీని అనౌన్స్ చేసారు దర్శకేంద్రుడు.
‘అల్లరి ప్రియుడు’ చిత్రాన్ని కే.రాఘవేంద్రరావు తన ఓన్ ఆర్.కే.ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఈ సినిమా హిందీలో హిట్టైన ‘సాజన్’ మూవీని తెలుగులు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. హిందీలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఇద్దరు హీరోలుగా నటించారు. మాధురి దీక్షిత్ కథానాయికగా నటించింది. బాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘సాజన్’ మూవీని తెలుగులో రాజశేఖర్ హీరోగా, రమ్యకృష్ణ, మధుబాల హీరో, హీరోయిన్లుగా రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కించారు.
DJ Tillu : ఆహాలో కూడా ఓహో అనిపిస్తోన్న DJ టిల్లు.. ఓటీటీలో కూడా తగ్గేదేలే..
ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. ముఖ్యంగా రోజ్ రోజ్ రోజా పువ్వా, ఏం పిల్లది ఎంత బాగున్నదితో పాటు అన్ని పాటలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. అంతేకాదు అప్పటి వరకు సన్నివేశాలకు తగ్గ పాటల్లో నటించిన రాజశేఖర్ ఈ సినిమాలో రాఘవేంద్రరావు అద్భుతమైన డాన్సులు చేయించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో రాజశేఖర్.. యాక్షన్ సినిమాలే కాదు.. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సినిమాలు సైతం చేయగలడని ప్రూవ్ చేసుకున్నారు.
Prabhas - Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కు U/A సర్టిఫికేట్.. రన్ టైమ్ ఎంతంటే..
ఏ ఇండస్ట్రీలోనైనా హీరోలు.. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్ హీరో ఇమేజ్ రావాలని కోరుకుంటారు. కానీ రాజశేఖర్ మాత్రం యాక్షన్ హీరో ఇమేజ్ చట్రం నుంచి లవర్ బాయ్‌గా తాను పనికొస్తానని ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ చేసిన డాన్స్ మూమెంట్స్ చేసి మెగాస్టార్ చిరంజీవి సైతం ఆశ్యర్యపోయారట.
అంతేకాదు ‘అల్లరి ప్రియుడు’ సినిమా చూసిన చిరంజీవి ప్రత్యేకంగా రాజశేఖర్‌కు ఫోన్ చేసి ఆయన చేసిన డాన్స్ మూమెంట్స్‌ను మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమా 100 రోజుల వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై అందరికీ షీల్డుల అందజేసారు. ఈ వేడుకకు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, అజారుద్దీన్ సహా అప్పటి భారత్ టీమ్ మొత్తం హాజరు కావడాన్ని గొప్పగా చెప్పుకున్నారు. ఇక చిరంజీవి.. రాజశేఖర్ హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో చేసిన ‘అంకుశం’ సినిమాను హిందీలో ‘ప్రతిబంధ్’గా రీమేక్ చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
ఈ రకంగా చిరు హిందీ చిత్ర పరిశ్రమ ఎంట్రీకి రాజశేఖర్ బ్లాక్ బస్టర్ ‘అంకుశం’ సినిమా ఉపయోగపడింది. ఇక అల్లరి ప్రియుడు సినిమా తర్వతా రాజశేఖర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ‘రాజ సింహం’ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, K. Raghavendra Rao, Rajasekhar, Tollywood