• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGASTAR CHIRANJEEVI ENTRING INTO SOCIAL MEDIA PLATFORM THIS TELUGU NEW YEAR UGADI TA

Chiranjeevi | ఉగాది రోజున మెగాస్టార్ చిరంజీవి అనూహ్య నిర్ణయం..

Chiranjeevi | ఉగాది రోజున మెగాస్టార్ చిరంజీవి అనూహ్య నిర్ణయం..

చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi | ఈ ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి ఆయన సోషల్ మీడియా అకౌంట్స్‌ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

  • Share this:
    ఈ ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.ఇక మీదట నుంచి ఆయన సోషల్ మీడియా అకౌంట్స్‌ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి అభిమానులకు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌కు సంబంధించిన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి తెలియజేసారు. ఇక మీదట తన మనసులోని భావాలను, సందేశాలను డైరెక్ట్‌గా అభిమానులతో పంచుకోవాలనే నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా చిరంజీవి తెలియజేసారు. చిరంజీవి ఇక మీదట ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చిరంజీవి కనిపించనున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షణ్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలోరామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. చరణ్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. మొత్తానికి మెగాస్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ఎపుడు సోషల్ మీడియాలో అడుగుపెడతాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



    Published by:Kiran Kumar Thanjavur
    First published: