పవన్ కంటే నాకు అది ఎక్కువేం కాదంటున్న చిరంజీవి..

Chiranjeevi Pawan Kalyan: చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిందేం ఉంది. అన్నయ్య తనకు దేవుడు అంటాడు పవర్ స్టార్. అలాగే పవన్ తనకు తమ్ముడు కాదు పెద్ద కొడుకు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2020, 6:30 PM IST
పవన్ కంటే నాకు అది ఎక్కువేం కాదంటున్న చిరంజీవి..
పవన్ కళ్యాణ్, చిరంజీవి (Pawan Kalyan Chiranjeevi)
  • Share this:
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిందేం ఉంది. అన్నయ్య తనకు దేవుడు అంటాడు పవర్ స్టార్. అలాగే పవన్ తనకు తమ్ముడు కాదు పెద్ద కొడుకు అంటాడు చిరంజీవి. దీన్నిబట్టి ఈ అన్నాదమ్ముల రిలేషన్‌పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికీ అన్నయ్య కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటాడు పవన్. ఇక తమ్ముడి కోసం అడిగింది ఇవ్వడానికి ఎప్పుడూ వెనకంజ వేయడు చిరంజీవి. మెగా బ్రదర్స్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు కూడా మరోసారి తన తమ్ముడిపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టాడు మెగాస్టార్.

పవన్ కళ్యాణ్, చిరంజీవి (Pawan Kalyan Chiranjeevi)
పవన్ కళ్యాణ్, చిరంజీవి (Pawan Kalyan Chiranjeevi)


తాజాగా అభిమానులతో ముచ్చటించిన అన్నయ్య.. చాలా విషయాల గురించి చర్చించాడు. ముఖ్యంగా ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చాడు ఈయన. అన్నింటికంటే ముఖ్యంగా తన సినిమాల గురించి.. వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చాడు చిరు. ఇదిలా ఉంటే తర్వాతి సినిమాల గురించి కూడా అభిమానులు అన్నయ్యను అడిగారు. దీనికి కూడా ఏం దాచుకోకుండా సమాధానమిచ్చాడు చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ ఆచార్యతో బిజీగా ఉన్నానని.. ఈ సినిమా తర్వాత లూసీఫర్ తెలుగులో రీమేక్ చేయబోతున్నానని చెప్పాడు. లూసిఫర్ తెలుగు రీమేక్‌కు ఇంకా దర్శకుడిని ఫిక్స్ చేయలేదని తెలిపాడు చిరు.

పవన్ కళ్యాణ్, చిరంజీవి (Chiranjeevi pawan Kalyan)
పవన్ కళ్యాణ్, చిరంజీవి (Chiranjeevi pawan Kalyan)
ఇదిలా ఉంటే లూసిఫర్ కథపై పవన్ మనసు పడ్డాడని.. ఈ సినిమాను తెలుగులో ఆయన రీమేక్ చేయాలనుకుంటున్నాడని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ న్యూస్ తన వరకు రాలేదని.. ఒకవేళ అదే కానీ నిజమైతే.. నిజంగానే పవన్ ఈ సినిమా రీమేక్ చేయాలనుకుంటే తనకు ఇచ్చేస్తానని తమ్ముడిపై ప్రేమను చూపించాడు చిరంజీవి. పవన్ కంటే ఈ సినిమా తనకేం ఎక్కువ కాదని చెప్పాడు మెగాస్టార్. అయితే ఇప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్. వకీల్ సాబ్‌తో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. వాటితో పాటు డాలి దర్శకత్వంలో కూడా రవితేజతో మల్టీస్టారర్ చేయబోతున్నాడు పవర్ స్టార్.
First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading