MEGASTAR CHIRANJEEVI EMOTIONAL TWEET ABOUT HIS MOTHER ANJANA DEVI BIRTHDAY TA
Mega Mother Anjana Devi : తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి భావోద్వేగ ట్వీట్..
తల్లి అంజనా దేవికి ట్విట్టర్ వేదికగా చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు (Twitter/Photo)
Happy Birthday Mega Mother Anjana Devi : ఈ రోజు మెగా మదర్ అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
Happy Birthday Mega Mother Anjana Devi : ఈ రోజు మెగా మదర్ అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మెగా మదర్ అంజనా దేవి, కొణిదెల వెంకట్రావు దంపతులుకు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు విజయలక్ష్మి, మాధవి మొత్తం ఐదుగురు సంతానం. ముగ్గురు మొనగాళ్లను కన్న అమ్మ అంజనా దేవి అంటూ మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ సరదాగా చెప్పుకుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురూ ముగ్గురే.. అలాంటి స్టార్స్‌కు జన్మనిచ్చిన అమ్మ పుట్టిన రోజు జనవరి 29.ఈ మెగా బ్రదర్స్ ముగ్గరు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా. చిరంజీవి మెగాస్టార్‌గా రాణిస్తే.. చిన్నబ్బాయి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా సత్తా చూపెడుతున్నారు. ఇక నాగబాబు నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా స్వీయ గృహ నిర్భందంలో ఉన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి అమ్మా జన్మదిన శుభాకాంక్షలు.. క్వారంటైన్ కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నా అన్నరు. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. చిరు చేసిన ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోట్లాది అభిమానులకు చిరంజీవి అయిన మెగాస్టార్.. తల్లికి మాత్రం ఇప్పటికీ శంకర్ బాబునే. ఈ సందర్భంగా తన ట్వీట్ చివరన అభినందనలతో .. శంకర్ బాబు అంటూ ట్వీట్ చేశారు.
అమ్మా !🌻💐
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
మెగా బ్రదర్స్ అందరూ కలిసి తల్లి అంజనా దేవి పేరు మీద ఓ బ్యానర్ స్టార్ట్ చేసారు. నాగబాబు ఈ బ్యానర్‌కు నిర్మాత. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో నాగబాబు...మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే కదా.
ఇక అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో తొలి సినిమా ‘రుద్ర వీణ’. ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో కే.బాలచందర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వా త ఈ బ్యానర్లో త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారూ బాగున్నారా. స్టాలిన్, గుడుంబా శంకర్, కౌరవుడు, రాధా గోపాలం, ఆరెంజ్ సినిమాలను తెరకెక్కాయి. మొత్తంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అంజనా దేవికి మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.