Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: March 9, 2020, 3:22 PM IST
చిరంజీవి డాన్సులు ఆచార్య సినిమాలో (Chiranjeevi acharya Dance)
చిరంజీవి అంటే ప్రేక్షకులు ముందుగా కోరుకునేది ఏంటి డాన్సులు.. ఆ తర్వాత ఫైట్లు.. ఆ తర్వాత కామెడీ వగైరా వగైరా. అసలు మెగాస్టార్ అందరికీ గుర్తొచ్చేది అయితే డాన్సులే. గతేడాది వచ్చిన సైరా నరసింహారెడ్డిలో డాన్సులు లేవు. ఆ సినిమాలో కథ ప్రకారం ఆయన డాన్సులు చేయకూడదు కాబట్టి కథను డిస్టర్బ్ చేయకుండా డాన్సుల జోలికి వెళ్లలేదు మెగాస్టార్. దాంతో ఖైదీ నెం 150 తర్వాత అభిమానులకు బాగా రుణపడిపోయాడు చిరు. ఇక ఇప్పుడు ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇందులో భారీగానే డాన్సులు ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నటి రెజీనా నటించింది.

చిరంజీవి డాన్సులు ఆచార్య సినిమాలో (Chiranjeevi acharya Dance)
తన సినిమా అంటే అభిమానులు ఏమేం కోరుకుంటారో అన్నీ ఉండేలా చూసుకుంటున్నాడు మెగాస్టార్. ఆ అన్నింట్లో డాన్సులు కూడా ఉంటాయి. ఆచార్య చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ అదిరిపోయింది. అందులో నక్సలైట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు చిరు. కొరటాల అంటే ఎలాగూ మాస్ ఎలివేషన్ సీన్స్ పీక్స్‌లో ఉంటాయి. అవి చూసిన తర్వాత సినిమాలో చిరంజీవి ఎలా ఉంటాడో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక డాన్సులు కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. 6 రోజుల పాటు రెజీనా సాంగ్ చిత్రీకరించారని చెప్పింది రెజీనా. ఇందులో చిరు డాన్సులకు తాను ఫిదా అయిపోయానని చెప్పింది ఈమె. చిరంజీవి కాబట్టే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పింది రెజీనా.

చిరంజీవి డాన్సులు ఆచార్య సినిమాలో (Chiranjeevi acharya Dance)
తన డాన్సులు చూసి చిరంజీవి గారు మెచ్చుకున్నారని గుర్తు చేసుకుంది రెజీనా. ఖైదీ నెం.150లో అమ్మడు కుమ్ముడు అంటూ రచ్చ చేసిన శేఖర్ మాస్టరే ఈ పాటకు కొత్త స్టెప్పులు కంపోజ్ చేసాడని తెలుస్తుంది. 64 ఏళ్ల వయసులోనూ చిరంజీవి కూడా రప్ఫాడించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. 50 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జోరుగా జరుగుతుంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసాడు కొరటాల శివ. 2020 దసరాకు విడుదల కానుంది ఆచార్య. కచ్చితంగా ఈ సినిమాలో డాన్సులతో చిరంజీవి బాకీ మొత్తం తీర్చడానికి సిద్ధమవుతున్నాడు.
Published by:
Praveen Kumar Vadla
First published:
March 9, 2020, 3:17 PM IST