సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి కోటి విరాళం..

Chiranjeevi: నితిన్ అందరికంటే ముందు సాయం చేస్తే.. ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయలు విరాళం చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 3:59 PM IST
సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి కోటి విరాళం..
చిరంజీవి Photo : Twitter
  • Share this:
నిన్నటి వరకు ఏంటి తెలుగు సినిమా హీరోలెవరూ స్పందించడం లేదు.. అలా ఉండిపోయారేంటి అనుకున్నారంతా. కొంతమంది విమర్శలు కూడా చేసారు. కానీ అంతలోనే హీరోలంతా ముందుకొచ్చారు. నితిన్ అందరికంటే ముందు సాయం చేస్తే.. ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయలు విరాళం చేసాడు. కరోనా వైరస్ బాధితుల కోసం ముఖ్యమంత్రుల సహాయనిధితో పాటు ప్రధాన మంత్రి నిధికి కూడా ఈ కోటిని విరాళంగా ఇచ్చాడు చిరు.

ఇండస్ట్రీలో ఉన్న రోజువారి కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా ఈ చిన్న సాయం చేస్తున్నట్లు ట్వీట్ చేసాడు చిరంజీవి. ఈ వైరస్ అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలపై చిరు ప్రశంసలు కురిపించాడు. దయచేసి అంతా ఇంట్లోనే ఉండి ఈ 21 రోజుల యుద్ధంలో గెలుద్దామని ట్వీట్ చేసాడు చిరు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు