చిరంజీవి 42 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి అలా చేస్తున్నాడా..?

చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో 151 సినిమాలు పూర్తి చేసాడు మెగాస్టార్. తనకంటూ ఇండియన్ సినిమాలో ప్రత్యేకమైన పేజీనే..

  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో 151 సినిమాలు పూర్తి చేసాడు మెగాస్టార్. తనకంటూ ఇండియన్ సినిమాలో ప్రత్యేకమైన పేజీనే లిఖించుకున్నాడు చిరు. వయసు 60 దాటినా కూడా ఇప్పటికీ అదే జోరులో వరస సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. లాక్ డౌన్ తర్వాత మిగిలిన భాగం కూడా పూర్తి చేయనున్నాడు కొరటాల. దానికి తోడు రాజమౌళి కూడా అనుమతి ఇవ్వడంతో రామ్ చరణ్ పార్ట్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు శివ కొరటాల.
చిరంజీవి కొరటాల సినిమా ఆచార్య (Chiranjeevi Look)
చిరంజీవి కొరటాల సినిమా ఆచార్య (Chiranjeevi Look)

దీనికోసం నెల రోజుల కాల్షీట్స్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్. ఇదిలా ఉంటే కొరటాల తర్వాత లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు చిరు. ఈ సినిమాను సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడు. వీడియో కాల్‌లో చిరు, సుజీత్ మాట్లాడుకుంటున్నారు. కావాల్సిన మార్పులు చేర్పులు చిరు కూడా సూచిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లో మోహన్ లాల్, పృథ్వీ రాజ్ హీరోలుగా నటించారు. ఇందులో మోహన్ లాల్‌కు హీరోయిన్ ఉండదు.
చిరంజీవి సుజీత్ (chiranjeevi sujeeth)
చిరంజీవి సుజీత్ (chiranjeevi sujeeth)

తెలుగులో చిరంజీవి కాబట్టి కచ్చితంగా హీరోయిన్ లేకుండా ఉండదనుకున్నారు అభిమానులు.. కానీ మెగాస్టార్ రిస్క్ తీసుకోడానికే రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ లేకుండానే లూసీఫర్ రీమేక్ చేయడానికి అన్నయ్య కాలు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగు వర్షన్‌లో మార్పులు చేసినా కూడా మరీ లేని హీరోయిన్‌ను తీసుకొచ్చి పెట్టేంత మార్పులు మాత్రం చేయడం లేదు. అందుకే ఉన్నదున్నట్లు దించేసి కాస్త మార్పులు చేస్తున్నాడు సుజీత్. ఒకవేళ ఇదే కానీ జరిగి చిరంజీవి నిజంగానే హీరోయిన్ లేకుండా సినిమా చేస్తే.. 42 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి జోడీ లేకుండా చిరు సినిమా చేసినట్లు అవుతుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published: