అవునా.. వాళ్లేం చేసారు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. చిరంజీవితో పాటు రామ్ చరణ్ తీరు చూసి నిర్మాతలు కూడా ఇదే అనుకుంటున్నారు నిర్మాతలు. ఎందుకంటే పదేళ్లుగా చిరంజీవి ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడా..? ఎప్పుడెప్పుడు ఆయనతో సినిమాలు చేద్దామా అని వేచి చూస్తున్నారు నిర్మాతలు. దర్శకుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. కుర్ర దర్శకులు కూడా ఆయన కోసం కథలు సిద్ధం చేసుకుని ఉంచుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మాత్రం చాలా తెలివిగా నడుచుకుంటున్నారు.

చిరంజీవి కాజల్ అగర్వాల్
రీ ఎంట్రీ సినిమాకు ఉన్న డిమాండ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు కొడుకును నిర్మాతని చేసి కొణిదెల ప్రొడక్షన్ స్థాపించాడు మెగాస్టార్. ఖైదీ నెం.150 సినిమాకు కోట్లకు కోట్ల లాభాలు అందుకున్నాడు చరణ్. ఈ సినిమా 104 కోట్ల షేర్ వసూలు చేసింది.. ఇంకా డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం. సరేలే.. 150వ సినిమా కదా ఆ మాత్రం ఆత్రం ఉంటుందిలే అనుకున్నారు కానీ 151వ సినిమా కూడా తనయుడికే ఇచ్చాడు చిరంజీవి. సైరా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ చిత్ర బిజినెస్ కూడా దాదాపు 300 కోట్ల వరకు జరుగుతుంది.

‘సైరా నరసింహారెడ్డి’ (File Photo)
200 కోట్లు కదా.. బయటి నిర్మాతలు బాగా తీస్తారో లేదో.. పైగా అది చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కదా అందుకే మళ్లీ సొంత బ్యానర్లో చేస్తున్నాడు అనుకున్నారు. కానీ 152వ సినిమా కూడా మళ్లీ కొణిదెల సంస్థలోనే చేస్తున్నాడు మెగాస్టార్. ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. అసలు బయట నిర్మాతలు ఎంతోమంది వేచి చూస్తున్నారు.. అల్లు అరవింద్, అశ్వినీదత్ లాంటి మెగా ప్రొడ్యూసర్స్ కూడా మెగా డేట్స్ కోసం చూస్తున్నారు. కానీ వరసగా మూడో సినిమా కూడా కొడుకు నిర్మాణంలోనే చేస్తున్నాడు చిరంజీవి.

చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్
కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిపి ఈ చిత్రం నిర్మించబోతున్నారు. నవంబర్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మొత్తానికి తనతో సినిమాలు చేయాలనుకుంటున్న నిర్మాతలకు షాక్ ఇస్తూ వరసగా కొడుకు నిర్మాణంలో సినిమాలు చేస్తూ లాభాలు కుమ్మేస్తున్నాడు మెగాస్టార్. మరి ఈ ట్రెండుకు ఆయన ఎప్పుడు చెక్ పెడతాడో ఏంటో..?
Published by:Praveen Kumar Vadla
First published:September 30, 2019, 14:59 IST