హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులకు ఆయనే ఫేవరేట్ హీరో అట..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులకు ఆయనే ఫేవరేట్ హీరో అట..

నాగబాబు, చిరంజీవి (File/Photo)

నాగబాబు, చిరంజీవి (File/Photo)

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో పాటు నాగబాబు(Nagababu) లకు ఆయన ఫేవరేట్ హీరో అట..

  Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో పాటు నాగబాబు(Nagababu) లకు ఆయన ఫేవరేట్ హీరో అట.. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టే చాల ా మంది హీరోలు తాము చిరంజీవి స్పూర్తితో హీరోగా ఎంట్రీ ఇచ్చామని చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్(ANR), కృష్ణ(Krishna), శోభన్ బాబు (Shobhan Babu), కృష్ణంరాజు(Krishnam Raju)ల తర్వాత ఎవరి అండదండలు లేకుండా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యారు. ఎంతో మంది హీరోలకు ఫేవరేట్ కథానాయకుడైన చిరంజీవికి ఇండస్ట్రీలో రాకముందు ఓ హీరో అంటే అభిమానమట. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna). చిరంజీవి పలు సందర్భాల్లో తన ఫేవరేట్ హీరో ఎస్వీఆర్ అని చెప్పారు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ అంటే అభిమానినని పలు సందర్భాల్లో చెప్పారు. చిరంజీవికే కాదు.. ఆయన బిగ్‌ బ్రదర్ నాగబాబుకు కూడా సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంతో అభిమానమట.

  అంతేకాదు చిరంజీవి వాళ్ల నాన్న వెంకట్రావు (Venkat Rao) గారికి  కూడా సూపర్ స్టార్ కృష్ణ అంటే అభిమానమట. ఆయన నటుడవ్వాలని ఎంతో ప్రయత్నించారు. కానీ ఎందుకో కుదరలేదు. అప్పట్లో ఒకటి రెండు సినిమాల్లో చిరంజీవి తండ్రిగారు వెంకట్రావు నటించారు. చిరంజీవి, నాగబాబు వాళ్లు చదువుకునే రోజుల్లో కృష్ణ గారి సినిమాలకు నేలటిక్కెట్ కొనుక్కొని వెళ్లేవారు.

  Chiranjeevi Krishna Sobhan Babu Krishnam Raju Chief Guest Of Khaidi No 786 100 Days Function Here Are The Details,Chiranjeevi: కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతో చిరంజీవి అపురూప చిత్రం.. ఎప్పటిదో తెలుసా..,Chiranjeevi,Chiranjeevi Twitter,Chiranjeevi Instagram,Chiranjeevi facebook,Chirnajeevi Khaidi No 786 Function,Krishna,Krishnam Raju,Sobhan Babu,Vijaya Bapineedu,Vijaya Bapineedu Chiranjeevi Super Hit Combination,Tollywood,చిరంజీవి,ఖైదీ నెం 786,ఖైదీ నెం 786 ఫంక్షన్‌లో కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు,చిరంజీవి విజయ బాపినీడు సూపర్ హిట్ కాంబినేషన్
  అలనాటి అగ్ర హీరోలైన కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు‌లతో చిరంజీవి (Twitter/Photo)

  ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోగా స్టార్‌డమ్ అనుభవిస్తున్న రోజుల్లో కృష్ణ గారు బుల్లెట్‌లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకెళ్లారు.అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో తొలి జేమ్స్‌బాండ్  మూవీ ‘గూఢచారి 116’, తొలి కౌబాయ్ మూవీ ‘మోసగాళ్లకు మోసగాడు’, తొలి సినిమాస్కోప్ ’అల్లూరి సీతారామరాజు’, తొలి 70 MM ‘సింహాసనం’, తొలి DTS మూవీ ‘తెలుగువీర లేవరా’ వంటి పలు సాంకేతికతలను టాలీవుడ్ ఇండస్ట్రీకి అందించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణదే.

  Chiranjeevi Industry Hits : ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..


  అంతేకాదు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కోసం అనుకున్న ‘ఖైదీ’ సినిమాను చిరంజీవి చేసి మెగాస్టార్ అయ్యారు. ఇక ‘ఖైదీ’ సినిమాను హిందీలో సూపర్ స్టార్ కృష్ణ.. జితేంద్ర, శతృఘ్న సిన్హా హీరోలుగా మాధవి, హేమా మాలిని హీరో, హీరోయిన్లుగా రీమేక్ చేసారు.

  HBDNagarjuna: హ్యాపీ బర్త్ డే అక్కినేని నాగార్జున.. టాలీవుడ్ బంగార్రాజు గురించి ఎవరికీ తెలియని నిజాలు..

  ఇక కృష్ణగారితో చిరంజీవి.. ‘కొత్త అల్లుడు’, ‘కొత్త పేట రౌడీ’ ‘తోడు దొంగలు’ సినిమాల్లో కలిసి నటించారు. ఇందులో ఒక్క ‘తోడు దొంగలు’ సినిమాలో మాత్రమే వీళ్లిద్దరు హీరోలుగా నటించారు. మరో రెండు చిత్రాల్లో ఒక సినిమాలో చిరంజీవి విలన్‌గా నటిస్తే.. మరో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసారు. ఇక నాగబాబు కూడా కృష్ణ గారితో ‘విష్ణు’తో పాటు ‘శ్రావణ మాసం’ సినిమాలో నటించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు విరామం ప్రకటించి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Bhola Shankar, Chiranjeevi, God father, Super Star Krishna, Tollywood

  ఉత్తమ కథలు