తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చిరంజీవి కీలక డిమాండ్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమలోనే అత్యున్నత పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందేలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పారు.

news18-telugu
Updated: January 7, 2020, 1:08 PM IST
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చిరంజీవి కీలక డిమాండ్..
చిరంజీవి
  • Share this:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక డిమాండ్ చేశారు. సరిలేరు నీకెవ్వరు ఈవెంట్‌లో పాల్గొన్న చిరు.. ప్రస్తుత దక్షిణ చలనచిత్ర పరిశ్రమలోనే సీనియర్ నటుడు హీరో కృష్ణ అని, ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని అన్నారు. సినీ పరిశ్రమలోనే అత్యున్నత పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందేలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వాలు గట్టి ప్రయత్నం చేయాలని.. ఇది తన డిమాండ్ అని ఆయన అన్నారు. కృష్ణకు ఆ అవార్డు దక్కితే అది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గౌరవం అని తెలిపారు. 350కి పైగా సినిమాలు చేశారని, ఆయన ధైర్య సాహసాలకు పెట్టింది పేరు అని కొనియాడారు. తెలుగు సినీ పరిశ్రమకు కొత్త టెక్నాలజీలను పరిచయం చేసిన వ్యక్తి ఆయన అని అన్నారు.

సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు మారడానికి, ఇక్కడో పెద్ద స్టూడియో పెట్టడానికి కారణం ఆయనేనని.. ఇలా చిత్ర పరిశ్రమకు ఎంతో చేసిన కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని, ఆ అవార్డుకు ఆయన అన్ని విధాలా అర్హుడని వ్యాఖ్యానించారు. అందువల్ల అవార్డు వచ్చేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త శుద్ధితో పనిచేయాలని చిరంజీవి డిమాండ్ చేశారు. అటు.. అల వైకుంఠపురం సినిమా మ్యూజికల్ కన్సర్ట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్.. తన తండ్రి అల్లు అరవింద్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరడం కొసమెరుపు.

First published: January 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు