తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి..

చిరంజీవి తమ్మారెడ్డి భరద్వాజ్ (Twitter/tammareddy bharadwaj chiranjeevi)

టాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి సోమ‌వారం మృతి చెందారు. కృష్ణ‌వేణి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే. మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో భ‌ర‌ద్వాజ‌ను ప‌రామ‌ర్శించారు.

  • Share this:
    టాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి సోమ‌వారం మృతి చెందారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. ఆమె గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. కృష్ణ‌వేణి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే. మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో భ‌ర‌ద్వాజ‌ను ప‌రామ‌ర్శించారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని సంతాప సందేశాన్ని తెలియ‌జేశారు. సినిమా ఒక మ‌జిలీ.. స‌మ స‌మాజం నా అంతిమ ల‌క్ష్యం అనే కృష్ణ‌మూర్తి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు తనవంతు సేవ‌లందించారని ఈ సందర్భంగా  గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి మరోవైపు తండ్రి అడుగుజాడల్లో తమ్మారెడ్డి భరద్వాజ కూడా తనదైన శైలిలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచుకున్నారన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: