చిరంజీవి, చరణ్ చాలా సార్లు గొడవపడ్డారు.. సుష్మిత కొణిదెల షాకింగ్ కామెంట్స్..

అవును.. నమ్మడానికి చాలా కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఈ నిజాన్ని చెప్పింది కూడా ఎవరో కాదు.. స్వయానా రామ్ చరణ్ అక్క, చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 25, 2019, 4:17 PM IST
చిరంజీవి, చరణ్ చాలా సార్లు గొడవపడ్డారు.. సుష్మిత కొణిదెల షాకింగ్ కామెంట్స్..
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)
  • Share this:
అవును.. నమ్మడానికి చాలా కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఈ నిజాన్ని చెప్పింది కూడా ఎవరో కాదు.. స్వయానా రామ్ చరణ్ అక్క, చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత. ఈమె సైరా నరసింహా రెడ్డి సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసింది. గతంలో కూడా చిరంజీవి సినిమాలకు ఈమె పని చేసారు. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది సుష్మిత. అయితే గత సినిమాలకు హాయిగా పని చేసిన సుష్మిత.. సైరా విషయంలో మాత్రం చాలా మదనపడ్డానని చెబుతుంది. ముఖ్యంగా క్రియేటివ్ ఇగోలను తట్టుకుని.. తన మనసు చంపుకుని.. ఇష్టాన్ని కాదనుకుని మరీ పని చేసానని సంచలన నిజాలు చెప్పింది మెగా డాటర్.

Megastar Chiranjeevi daughter Sushmita Konidela sensational comments on Ram Charan behaviour as Producer pk అవును.. నమ్మడానికి చాలా కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఈ నిజాన్ని చెప్పింది కూడా ఎవరో కాదు.. స్వయానా రామ్ చరణ్ అక్క, చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత. sye raa,sye raa twitter,sye raa release date,chiranjeevi ram charan,ram charan chiranjeevi war,ram charan sushmita konidela,chiranjeevi sushmita konidela,telugu cinema,sye raa nayanthara,సైరా,సైరా నరసింహా రెడ్డి,సుష్మిక కొణిదెల,రామ్ చరణ్ చిరంజీవి,చిరంజీవి సుష్మిత,తెలుగు సినిమా
తండ్రి చిరంజీవితో కూతురు సుష్మిత కొణిదెల

వారంలో 15 కాస్ట్యూమ్స్ సిద్ధం చేయమన్నా కూడా రాత్రి పగలు కష్టపడుతూ తాను ఆపని చేయగలనని చెబుతుంది సుష్మిత. అయితే సైరా విషయంలో మాత్రం అలా జరగలేదని.. తనకు ఎదురైన క్రియేటివ్ ఇగోలను హ్యాండిల్ చేయడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చింది ఈమె. తనకు నచ్చకపోయినా కూడా టీం కోసం సర్దుకుని పని చేసినపుడు కన్నీరు కూడా వచ్చేవని చెప్పింది సుష్మిత. అంతేకాదు.. తండ్రీ కొడుకులుగా ఉన్నపుడు చిరంజీవి మాటలను జవదాటని రామ్ చరణ్.. నిర్మాతగా మాత్రం చండశాసనుడే అంటుంది ఈమె.

Megastar Chiranjeevi daughter Sushmita Konidela sensational comments on Ram Charan behaviour as Producer pk అవును.. నమ్మడానికి చాలా కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఈ నిజాన్ని చెప్పింది కూడా ఎవరో కాదు.. స్వయానా రామ్ చరణ్ అక్క, చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత. sye raa,sye raa twitter,sye raa release date,chiranjeevi ram charan,ram charan chiranjeevi war,ram charan sushmita konidela,chiranjeevi sushmita konidela,telugu cinema,sye raa nayanthara,సైరా,సైరా నరసింహా రెడ్డి,సుష్మిక కొణిదెల,రామ్ చరణ్ చిరంజీవి,చిరంజీవి సుష్మిత,తెలుగు సినిమా
చిరంజీవి, రామ్ చరణ్

సైరా సినిమా విషయంలో చిరంజీవి, చరణ్ మధ్య చాలా సార్లు గొడవలు అయ్యాయని.. ఏకంగా చిరంజీవితోనే వాదోపవాదాలు ఆడాడని తమ్ముడి గురించి నిజాలు చెప్పింది సుష్మిత. తనకు కావాల్సినవి వచ్చేంతవరకు చరణ్ అస్సలు కాంప్రమైజ్ కాడని.. దానికోసం ఎంత కష్టపడినా కూడా ఔట్ పుట్ మాత్రం బాగా రావాలని ఆర్డర్స్ వేస్తాడని చెప్పింది.

Megastar Chiranjeevi daughter Sushmita Konidela sensational comments on Ram Charan behaviour as Producer pk అవును.. నమ్మడానికి చాలా కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఈ నిజాన్ని చెప్పింది కూడా ఎవరో కాదు.. స్వయానా రామ్ చరణ్ అక్క, చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత. sye raa,sye raa twitter,sye raa release date,chiranjeevi ram charan,ram charan chiranjeevi war,ram charan sushmita konidela,chiranjeevi sushmita konidela,telugu cinema,sye raa nayanthara,సైరా,సైరా నరసింహా రెడ్డి,సుష్మిక కొణిదెల,రామ్ చరణ్ చిరంజీవి,చిరంజీవి సుష్మిత,తెలుగు సినిమా
చిరంజీవి, రామ్ చరణ్ (పైల్ ఫోటో)

కొన్ని విషయాలు చిరంజీవి చేయనని చెప్పినపుడు.. చరణ్ తన దగ్గరికి వచ్చి 'నాన్న ఈ పని ఎలాగైనా చేయాలి.. ఆయన్ని నువ్వే ఒప్పించు' అని తనకు చాలా సార్లు ఆర్డర్ వేసాడని గుర్తు చేసుకుంది సుష్మిత. అప్పుడు మరో దారిలేక చిరంజీవి దగ్గరకు వెళ్లి ఆయన మూడ్‌కు తగ్గట్టుగా మాట్లాడి కూల్ చేసి ఒప్పించడానికి తనకు చుక్కలు కనిపించాయంటూ సైరాపై షాకింగ్ కమెంట్స్ చేసింది చిరు పెద్ద కూతురు.
First published: September 25, 2019, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading