సుహాసిని, రాధ, ఖుష్బూలతో చిరంజీవి అలనాటి డాన్స్ మూమెంట్స్..

chiranjeevi | ఉగాది పండగ సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన చిరంజీవి.. ఆ తర్వాత ఎంతో యాక్టివ్‌గా తనకు సంబంధించిన విషయాలను సోసల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా చిరంజీవి అలనాటి హీరోయిన్లతో డాన్స్ చేసిన మూమెంట్స్‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

news18-telugu
Updated: May 3, 2020, 6:11 PM IST
సుహాసిని, రాధ, ఖుష్బూలతో చిరంజీవి అలనాటి డాన్స్ మూమెంట్స్..
అలనాటి హీరోయిన్స్‌తో చిరంజీవి డాన్స్ మూమెంట్స్ (Twitter/Photo)
  • Share this:
ఉగాది పండగ సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన చిరంజీవి.. ఆ తర్వాత ఎంతో యాక్టివ్‌గా తనకు సంబంధించిన విషయాలను సోసల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు సమాజంలో జరిగే సంఘటనలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.తాజాగా బార్డర్‌లో శత్రువులతో పోరాడే సైనికులు.. కంటికి కనిపించని కరోనా వైరస్‌తో పోరాడుతున్న వైద్యులపై పూల జల్లులు కురిపించాయి. ఈ సందర్భంగా చిరంజీవి.. సైనికులతో పాటు వైద్యులపై ప్రశంసల ఝల్లు కురిపించారు. తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్‌లో మరో వీడియోను షేర్ చేసారు. 80లలో హీరో, హీరోయిన్లుగా రాణించిన వాళ్లు ప్రతి యేడాది ఒకసారి కలుసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా అలనాటి హీరో, హీరోయిన్లు తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా చిరంజీవి.. గతేడాది 80 యాక్టర్స్ కలిసిన వేళ.. హీరోయిన్స్ సుహాసిని, రాధ, ఖుష్బూలతో పాటు జయప్రదలతో చేసిన డాన్స్ మూమెంట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఇందులో సుహాసినితో రాక్షసుడు సినిమాలోని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు డాన్స్ మూమెంట్స్ చేసారు. ఆ తర్వాత చిరు.. రాధతో మరణ మృదంగంలోని సరిగమ పదనిస పాటకు చిందేసారు. ఆ తర్వాత కుష్బూతో ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటకు రిథమ్ కలిపాడు. ఈ పాటకు కుష్బూతో పాటు జయప్రద,జయసుధ తదితరులు స్టెప్పులు వేసారు. ఇపుడీ వీడియోను చిరు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 3, 2020, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading