Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI COMMENTS ON MAA ELECTION RESULTS SAYS VOTED ACCORDING TO CONSCIENCE MKS

MAA Elections Results: ముందే చెప్పేసిన మెగాస్టార్ Chiranjeevi -జరగబోయేది ఇదే..

మా ఎన్నికలపై చిరంజీవి

మా ఎన్నికలపై చిరంజీవి

Megastar Chiranjeevi on MAA Election Results | ఉత్కంఠభరితంగా సాగుతోన్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతిమ ఫలితం ఎలా ఉండబోతోందో మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఆదివారం పోలింగ్ సమయంలోనూ ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లు తీవ్ర స్థాయిలో గొడవలు పడుతోన్నక్రమంలో ఫలితాల అనంతర పరిస్థితిపై, విజేతలపై చిరు తన మార్కు కామెంట్లు చేశారు..

ఇంకా చదవండి ...
రాజకీయ పార్టీల ప్రమేయం నేరుగా లేకున్నా పొలిటికల్ డ్రామాకు ఏ మాత్రం తగ్గకుండా టాలీవుడ్ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఆదివారం కొనసాగుతోన్న పోలింగ్ లో పలు మార్లు ఉద్రిక్తకర పరిస్థితులు, అంతలోనే స్నేహానురాగాలు కనిపించాయి. పోలింగ్ కేంద్రమైన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగుతున్నది. ఇంకొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, రాబోయే ఫలితాలను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్లు చేశారు. సినీ పరిశ్రమలో జరగబోయే పరిణామాలనూ ఆయన చూచాయగా వెల్లడించారు..

మెగా ఓటు ఎవరికో తెలుసా?
మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ తెరపైకి వచ్చినప్పటి నుంచి ఆయనకు మెగా ఫ్యామిలీ అన్ని రకాలుగా అండగా నిలవడం తెలిసిందే. పవన్ కల్యాణ్, నాగబాబులు బాహాటంగా ప్రకాశ్ రాజ్ తరఫున ప్రచారం చేయగా, అన్నయ్య చిరంజీవి మాత్రం సంయమనం పాటిస్తూ వచ్చారు. ఆదివారం ఉదయమే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన చిరంజీవి.. మీడియాతో మాట్లాడారు. మీ మద్దతు ప్రకాశ్ రాజ్ కేనా? అన్న ప్రశ్నకు ‘నేను నా అంతరాత్మ ప్రభోదానికి అనుగుణంగా ఓటు వేశా ’అని చమత్కరించారు. ఇది సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి ఓటు ఎవరికి వేశానన్నది బయటికి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతటితో ఆగకుండా..

గెలిచేది వాళ్లే..
మా ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటేశానని చెప్పిన చిరంజీవి.. ఫలితాలపైనా వ్యాఖ్యలు చేశారు. ‘మా తోటి కళాకారులు అందరూ ఏదైతే కోరుకుంటారో ఫలితాల్లో అదే జరుగుతుంది. మావాళ్లు ఎవరినైతే ఎన్నుకుంటారో, ఎవరినైతే గెలిపిస్తారో వాళ్లకే నా మద్దతు’అని వ్యాఖ్యానించారు. ఫలితాల కంటే ముందే.. గెలిచినవాళ్లకే నా మద్దతు అని ప్రకటించడం ద్వారా చిరంజీవి ప్రస్తుత పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే..

ఇంకోసారి ఇలా జరగనివ్వను..
మా ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలు, హడావుడిపై చిరంజీవి సైతం చిరుబుర్రులాడారు. ఇప్పటిదాకా ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదన్న ఆయన.. రాబోయే రోజుల్లో మాత్రం ఇలాంటివి కచ్చితంగా జరగకుండా చూస్తామన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఓకేలా ఉండాలనేం లేదని, తగినట్లుగా మనం సమాయత్తం కావాలని, అయితే, దురదృష్టకర ఘటనలు మాత్రం బాధాకరమని, మరోసారి ఇలాంటివి జరక్కుండా చూసుకుంటామని చిరంజీవి తెలిపారు.

మాలో మారిన సీన్?

కొందరు షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చని, దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడబోనని మెగాస్టార్ అన్నారు. కాగా, మా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుండగా, గెలిచినవారికే నా మద్దతు అని, రాబోయే రోజుల్లో ఇలాంటి గొడవలకు అవకాశం ఇవ్వబోమని చిరంజీవి స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. పోలింగ్ బూత్ వద్ద రెండు ప్యానెళ్ల నేతలు పరస్పరం ఆలింగనాలు చేసుకోవడం, పోటీని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నట్లు ప్రకటనలు చేస్తున్న క్రమంలో చిరంజీవి కామెంట్లకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
Published by:Madhu Kota
First published:

Tags: Chiranjeevi, MAA, MAA Elections, Megastar Chiranjeevi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు