ఉయ్యాలవాడ వారసుల విషయంలో చిరంజీవి అబద్దాలు..

ఉయ్యాలవాడ వారసుల విషయమై చిరంజీవి అబద్దం చెప్పారని ఉయ్యాలవాడ వారసులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: October 1, 2019, 11:15 AM IST
ఉయ్యాలవాడ వారసుల విషయంలో చిరంజీవి అబద్దాలు..
చిరంజీవి (File Photo)
  • Share this:
ఉయ్యాలవాడ వారసుల విషయమై చిరంజీవి అబద్దం చెప్పారని ఉయ్యాలవాడ వారసులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మించాడు. ఈ సినిమా విషయమై  చిరంజీవి, రామ్  చరణ్ తమకు ఇచ్చిన నిలబెట్టుకోలేదని ఉయ్యాలవాడ వంశస్థులు ఆరోపించారు.ఈ సందర్భంగా వారు  తమకు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి కార్యాలయం ముందు ధర్నా చేసారు.  మరోవైపు ఉయ్యాలవాడ వారసులు..ఈ సినిమా విషయమై కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే కదా.

Uyyalawada Narasimha Reddy family devided into two and another party honoring Chiranjeevi pk సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదలయ్యేంత వరకు కూడా చాలా వివాదాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను చుట్టుమట్టి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కేసు కూడా ఫైల్ చేసారు. Uyyalawada Narasimha Reddy,sye raa,sye raa twitter,sye raa chiranjeevi,sye raa pre release event,chiranjeevi ram charan,Uyyalawada Narasimha Reddy honoring chiranjeevi,Uyyalawada Narasimha Reddy statue,Uyyalawada Narasimha Reddy family case,sye raa case,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,సైరా ట్విట్టర్,సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్,తెలుగు సినిమా,చిరంజీవి రామ్ చరణ్
‘సైరా నరసింహారెడ్డి’ (Source: Twitter)sy


తాజాగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎవరో కావాలనే ఉయ్యాలవాడ వారసులను ఉసిగొల్పారని పేర్కొన్న సంగతి తెలిసిందే కదా. ఉయ్యాలవాడ వారసులు 23 కుటుంబాల వారు ఒక్కొక్కరు రూ.2 కోట్లు చొప్పున డిమాండ్ చేసారని చిరు చెప్పారు. ఈ విషయమై ఉయ్యాలవాడ వారసులు స్పందించారు. చిరంజీవి చెప్పినట్లు తమ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్క కుటుంబానికి రూ.2 కోట్లు చెల్లించమని అడగలేదన్నారు. ఆయన అబద్ధం చెబుతున్నారని చెప్పారు. ఐతే.. రామ్ చరణ్ ఇది వరకు చెప్పినట్టు తాము ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు మాత్రమే అడిగినట్టు ఈ సందర్భంగా తెలిపారు. తమ వంశానికి చెందిన ఉయ్యాలవాడ చరిత్ర అందరికీ తెలియాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ సినిమా పై వేసిన కేసులన్ని వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు సెన్సార్ చేసేటపుడు సైరా చిత్ర యూనిట్ ఈ చిత్రం ఎవరి బయోపిక్ కాదని ఫిక్షన్ స్టోరీ చెప్పి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 1, 2019, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading